BigTV English

Rashmika Mandanna: ప్రమాదానికి గురైన రష్మిక.. షాక్ లో ఫ్యాన్స్

Rashmika Mandanna: ప్రమాదానికి గురైన రష్మిక.. షాక్ లో ఫ్యాన్స్

Rashmika Mandanna:  నేషనల్ క్రష్  రష్మికమందన్న ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్నీ ఆమె  స్వయంగా  అభిమానులతో చెప్పుకొచ్చింది.  తాను ఒక చిన్న ప్రమాదానికి గురయ్యానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుపుతూ ట్వీట్ చేసింది.


” హే గయ్స్.. ఎలా ఉన్నారు మీరు.. గత కొన్నిరోజులుగా నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేను. పబ్లిక్ లో కనిపించలేదు.గత నెలలో నేను పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం, నాకు చిన్న ప్రమాదం (మైనర్) జరిగింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. నేను డాక్టర్లు చెప్పినట్లుగా ఇంట్లోనే ఉన్నాను.  నేను ఇప్పుడు మెరుగ్గా ఉన్నాను.

ఇకనుంచి నా రెగ్యులర్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉంటాను. మీరు కూడా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ జీవితం చాలా చిన్నది.  రేపు ఉంటుందో లేదో చెప్పలేము.. ప్రతి రోజును సంతోషంగా గడపండి. మరొక అప్‌డేట్ నేను చాలా లడ్డూలు తింటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.


ఇక దీంతో అసలు రష్మికకు ఏమైందో అని నెటిజన్స్ కంగారుపడుతున్నారు.  ఆ ప్రమాదం ఎక్కడ జరిగింది. షూట్ లోనా.. లేక బయటన అని ఆరాలు తీస్తున్నారు. ఇక   రష్మిక బావుంది అని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. జాగ్రత్తగా ఉండమని, త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక  ప్రస్తుతం రష్మిక కెరీర్ విషయానికొస్తే .. వరుస సినిమాలతో బిజీగా మారింది. కుబేర, పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు రష్మిక చేతిలో ఉన్నాయి.  మరి ఈ సినిమాలతో రష్మిక ఎలాంటి విజయాలను  అందుకుంటుందో చూడాలి. 

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×