E-Paper
Advertisement

Pawan Kalyan: పంచాయతీ రాజ్ శాఖలో నూతన సంస్కరణలు.. ఒకేసారి 10 వేల మందికి పైగా పదోన్నతులు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: పంచాయతీ రాజ్ శాఖలో నూతన సంస్కరణలు.. ఒకేసారి 10 వేల మందికి పైగా పదోన్నతులు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Advertisement

Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా 10 వేల మందికి పైగా పదోన్నతులు కల్పించామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా ఉద్యోగుల సాధకబాధకాలు తనకు తెలుసన్నారు. తన శాఖ పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఏం చేయగలనని మొదటి నుంచి ఆలోచించానన్నారు. ఉన్నతాధికారులను అడిగితే తీసుకురావాల్సిన సంస్కరణలు చాలా ఉన్నాయని అన్నారు. ఒక ప్రమోషన్ వస్తే ఉద్యోగి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుందన్నారు. వారు మరింత ప్రభావవంతంగా పని చేస్తారన్నారు. అందుకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారాన్ని బలంగా, పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్లామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు

ఈ రోజు ప్రమోషన్లతో మీరు ఎంత సంబరపడ్డారో.. మీరు అందించే సేవల ద్వారా ప్రజలు కూడా అంతే ఆనందపడాలని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ప్రజలకు సేవలు అందించే క్రమంలో అధికారులు నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఏడాదిన్నర పాలనలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో ఎన్నో నూతన సంస్కరణలు అమలు చేశామన్నారు. మరిన్ని అమలు చేయబోతున్నామన్నారు. చట్టబద్దంగా చేయగలిగినవన్నీ చేస్తామని తెలిపారు. ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తామన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పెండింగ్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. బుధవారం మంగళగిరిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బందితో మాటా మంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

పల్లెలు బాగుంటే దేశం బాగుంటుంది

Advertisement

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “పల్లెలు బాగుంటే దేశం బాగుంటుంది. అందుకే గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పంచాయతీరాజ్ శాఖను ఎంచుకున్నాను. అనుభవం ఉన్న అధికారి పర్యవేక్షణ కావాలని శశిభూషణ్ కుమార్ ను ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నాం. ఉపముఖ్యమంత్రి హోదాలో ఎక్కడా నా సొంత తెలివితేటలు వాడలేదు. కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు తీసుకోకుంటే ఒప్పు అన్న పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ, వెంకటకృష్ణ లాంటి నిబద్దతతో పని చేసే బలమైన అధికారులు నాతో ఉన్నారు. వారి అనుభవంతో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు అభివృద్ధి చేయలేదు. కనీస మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించలేదు. ప్రతి పోస్టుకి, బదిలీకి ఒక రేటు కార్డు ఉండేది” అని అన్నారు.

పారదర్శకంగా పదోన్నతులు

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఔట్ సోర్సింగ్ తో కలిపి సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వీరికి పదోన్నతులు కల్పించే వ్యవహారంలో కార్యాలయ అధికారులు వెన్నెముకలా నిలిచారన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వ్యవస్థ ప్రక్షాళణకు సంస్కరణలు అవసరమని వారు చెప్పేవారన్నారు. సమీక్షల సమయంలో చిన్న చిన్న మార్పులు తీసుకురావడం ద్వారా మంచి ఫలితాలు సాధించామన్నారు. పదోన్నతుల వ్యవహారంలో తాను కల్పించుకోనని ముందే చెప్పానన్నారు. సీనియారిటీ, సిన్సియారిటీ ఆధారంగా నివేదికలు ఇవ్వాలని సూచించానన్నారు. బదిలీలు, పదోన్నతులపై ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు లెటర్లు ఇచ్చారని, సిఫార్సు పొందిన ఉద్యోగికి నిర్దేశిత ప్రమాణాలకు తగిన అర్హత ఉంటేనే దానిని ఆమోదించాలని స్పష్టంగా చెప్పామన్నారు.

ఉద్యోగుల ఆకాంక్షలు తీరుతాయి

Advertisement

‘ఇవాళ 10 వేల మంది పైచిలుకు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాం. ఉమ్మడి ఏపీలో కూడా పదోన్నతుల వ్యవహారంలో ఇంత భారీ స్థాయిలో సంస్కరణలు అమలు చేయలేదు. నేడు పూర్తి పాదర్శకంగా మీకు పదోన్నతులు కల్పించాం. మేము ఎంత పాదర్శకంగా నిలబడ్డామో అదే స్ఫూర్తిని మీరు గ్రామాల్లోనూ ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు సంపద పెంచిన తర్వాత హక్కులు, జీతాల పెంపు గురించి మాట్లాడాలి. ఆర్థిక వ్యవస్థ గాడిన పడకుండా అన్నీ ఒకేసారి చేయలేమన్న విషయాన్ని గుర్తించాలి’- డిప్యూటీ సీఎం పవన్

పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధి

‘గ్రామాల అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఎన్నో సంస్కరణలు అమలు చేశాం. పంచాయతీల అధికారాలు పంచాయతీలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న క్లస్టర్ వ్యవస్థను రద్దు చేశాం. 13,350 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పాలనా యూనిట్లుగా మార్చాం. జనాభా ప్రాతిపదికన నాలుగు గ్రేడ్లుగా విభజించాం. క్లస్టర్ వ్యవస్థలో మూడు, నాలుగు పంచాయతీలకు ఒక గ్రామ కార్యదర్శి విధులు నిర్వహించే వారు. నూతన విధానంతో గ్రేడ్ల వారీగా విభజించి ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీని నియమించాం. తద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సులభతరం అవుతాయి. అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును గ్రామ అభివృద్ధి అధికారి (విలేజ్ డెవలప్ మెంట్ ఆఫీసర్) గా మార్చాము. 10 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీలను మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కలలను సాకారం చేసే దిశగా రూర్బన్ పంచాయతీలుగా గుర్తించాం. డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి గెజిటెడ్ అధికారిని నియమించి మున్సిపాలిటీలతో సమాన అభివృద్ధి చేపట్టేలా చర్యలు తీసుకున్నాం’ అని పవన్ అన్నారు.

Also Read: Tirumala Break Darshan: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. డిసెంబర్, జనవరిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

మహిళా ఉద్యోగులను వేధిస్తే కఠిన చర్యలు

ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణను వ్యక్తిగతంగా తీసుకుని ముందుకు తీసుకువెళ్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. విధి నిర్వహణలో చిన్నపాటి ఉద్యోగికి ఇబ్బంది వచ్చినా అండగా నిలుస్తామన్నారు. మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడే వారిపై బలమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. రాజకీయ పరమైనదాడులను ఉపేక్షించమన్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×