Pawan Kalyan: జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ఆయన తన స్పీచ్ లలో సైతం పలు పుస్తాకాలను ప్రస్తావిస్తుంటారు. అంతే కాకుండా కరోనా వచ్చిన సమయంలోనూ పవన్ పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేశారు. కాగా మరోసారి డిప్యూటీ సీఎం పవన్ పుస్తకాలపై తన ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. ఉదయం కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ అయ్యారు.
Also read: మీ సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉందా.. ఈ ఛాన్స్ మిస్ కావద్దు!
ఈ భేటీలో ఏపీలో టూరిజంకు సంబంధించిన అంశాలను చర్చించారు. ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఇక ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ బుక్ స్టోర్లను సందర్శించడం ఆసక్తికరంగా మారింది. కన్నాఘట్ ప్రాంతంలోని ఐకానిక్ ఆక్స్ ఫర్డ్ బుక్ స్టోర్ ను ఆయన సందర్శించారు. అదేవిధంగా ఖాన్ మార్కెట్ లోని ఫాకిర్చాంద్ బుక్ స్టోర్ కు వెళ్లారు. ది రిపబ్లిక్ అనే పుస్తకంతో పాటూ మరికొన్ని పుస్తకాలను కొనుగోలు చేశారు.
పవన్ కల్యాణ్ పుస్తకాల స్టోర్ లో పరిశీలిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా పుస్తకాల వల్ల జ్ఞానం పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయ నాయకులు మాత్రం ఇలా పుస్తకాలు కొనుగోలు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవడం అరుదుగా కనిపిస్తుంది. రాజకీయ నాయకులు అంటే మాస్ స్పీచ్ లు, పవర్ ఫుల్ డైలాగులే కనిపిస్తుంటాయి. కానీ పవన్ మాత్రం అందరిలా కాకుండా పుస్తకాలు చదువడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన వల్ల మరికొంతమంది, యువతకు కూడా పుస్తకాలపై ఆసక్తి పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.