Kula Sekhar Passes Away:ప్రముఖ గీతా రచయిత కులశేఖర్ (Kulasekhar) తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఈయన.. తాజాగా (నవంబర్ 26) తుది శ్వాస విడిచినట్లు గాంధీ హాస్పిటల్ వైద్య బృందం తెలిపింది. ఆయన మరణంతో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కులశేఖర్ యాక్సిడెంట్ కి గురవగా.. స్థానికులు హుటాహుటిన హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్ కి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు సమాచారం.
అమ్మాయి మోజులో పడి ఇండస్ట్రీకి దూరం..
‘చిత్రం’, ‘నువ్వు-నేను’, ‘మనసంతా నువ్వే’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు పాటల రచయితగా పనిచేసిన కులశేఖర్ స్వస్థలం సింహాచలం. 1971 ఆగస్టు 15న జన్మించిన ఈయన, మొదట తన జీవితాన్ని జర్నలిస్టుగా మొదలుపెట్టారు. ఆ తర్వాత ‘చిత్రం’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. తన టాలెంట్ తో డైరెక్టర్ తేజ (Teja ), మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ (RP.Patnayak)లకు పరిచయమై.. వారు తీసిన చిత్రాలకు పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇక వీరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా కులశేఖర్ ‘ఘర్షణ’ సినిమా వరకు దాదాపు 100 సినిమాలకి పాటలు రాశారు. అప్పట్లో కులశేఖర్ పాట కావాలని ఎంతోమంది అడిగేవారట. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఒక హీరోయిన్ తో సన్నిహితంగా ఉండే ఈయన, అనుకోకుండా ఒక రోజు షూటింగ్ స్పాట్ నుంచే ఆ హీరోయిన్ ని తీసుకెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన కెరియర్ చిక్కుల్లో పడినట్లు సమాచారం.
దొంగతనం చేసి అరెస్ట్ అయిన కులశేఖర్..
తను తీసుకెళ్లిన హీరోయిన్ తో జీవితాన్ని గడపాలి అనుకున్నారు. కానీ చేతుల్లో డబ్బులు లేక హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మాతా ఆలయంలో పనిచేసే పూజారి బ్యాగును లాక్కొని, అందులోని శఠగోపాన్ని దొంగతనం చేశారట.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి రూ.50 వేల విలువైన 10 మొబైల్స్, రూ.45,000 విలువ చేసే బ్యాగ్ లు, క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు తాళం చెవులను కూడా బంజారాహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
దొంగతనంపై క్లారిటీ..
ఇకపోతే అమ్మాయి కోసమే దొంగతనం చేశాడంటూ వార్తలు రాగా.. గతంలోనే ఆయన క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. నేను బ్రాహ్మణుడిని ,నా తండ్రి వైజాగ్ లోని ఒక దేవాలయంలో పూజారిగా పని చేసేవారు. అయితే నేను బ్రాహ్మణులపై రాసిన పాట తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని, బ్రాహ్మణ సమాజం నన్ను వెలివేసింది. అప్పటి నుంచే ఎంతో మానసిక క్షోభను ఎదుర్కొన్నాను. ఆ వ్యవస్థ పై కక్ష పెంచుకున్నాను. అందుకే ఆలయాలను లక్ష్యంగా చేసుకొని, పూజారుల బ్యాగులు, సెల్ ఫోన్లు చోరీ చేయడమే కాకుండా 2013లో కాకినాడలోని బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శఠగోపాన్ని కూడా ఎత్తుకెళ్లాను అంటూ ఆయన పోలీసులతో చెప్పినట్లు సమాచారం.
జీవితమే నాశనం..
ఇలా ఎంత వివరణ ఇచ్చినా.. ఈయనపై మాత్రం దొంగ అనే ముద్ర పడిన తర్వాత మానసికంగా కృంగిపోయి మతిస్థిమితం లేకుండా పోయిందని ఇండస్ట్రీలో చాలామంది చెప్పుకున్నారు కూడా.. ఎలాంటి అద్భుతమైన కెరియర్.. కేవలం అమ్మాయి మీద వ్యామోహంతో చివరికి దొంగగా మారి జీవితాన్ని నాశనం చేసుకున్నారట కులశేఖర్. ఇకపోతే హీరో వెంకటేష్ (Venkatesh )నటించిన ఘర్షణ(Gharshana )సినిమాకి పాటల రచయిత గానే కాకుండా మాటల రచయితగా కూడా పనిచేశారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఈయన చివరికి ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారు.