E-Paper
Advertisement

Tdp vs ysrcp : వెల్‌కమ్ టు ఏపీ.. టీడీపీ vs వైసీపీ డైలాగ్ వార్

Tdp vs ysrcp : వెల్‌కమ్ టు ఏపీ.. టీడీపీ vs వైసీపీ డైలాగ్ వార్
Advertisement

ఏపీలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో నివాసం, ఉద్యోగాలు చేస్తున్నవారంతా సొంతూళ్లకు పయనమయ్యారు. రెండ్రోజుల నుంచే ఏపీకి వెళ్లే రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇక సంక్రాంతి స్పెషల్‌గా ఉత్తరాంధ్రలో పందెం రాయుళ్లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.రాజకీయ నాయకులు సైతం వారికి సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏడాదికి ఒక్కసారి వచ్చే సంక్రాంతి కోసం ఏపీలో నెల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం సంక్రాంతి పండుగకు వచ్చే ప్రజల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇదిలాఉంటే, సొంతూళ్లకు వస్తున్న వారు ఏపీ అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వం పనితీరుపై చర్చించుకుంటున్నట్టు అటు వైసీపీ, ఇటు టీడీపీ నడుమ డైలాగ్ వార్ నడుస్తున్నది.

అగ్గి రాజేసిన వైసీపీ..

ప్రతిపక్ష వైసీపీ ఎప్పటిలాగే ఏపీ ప్రభుత్వంపై మరోసారి విషం చిమ్మిందని ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి పండుగకు తమ కుటుంబాలు, స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడిపేందుకు వలస వెళ్లిన వారంతా తిరుగుబాట పట్టారు. అలాగే, పల్లె వాతావరణం, ఏపీలో ఫెస్టివల్ వైబ్స్‌ను ఆస్వాదించేందుకు వస్తున్న అతిథుల ముందు రాష్ట్రం పరువు తీసేలా వైసీపీ సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తున్నట్టు తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇలా చేయడం ప్రతిపక్ష వైసీపీ నేతలకు కొత్తేమీ కాదని కూటమి నేతలు అంటున్నారు. ఇంతకు వైసీపీ చేసిన ఘనకార్యం ఏంటంటే.. ఏఐ ద్వారా మీమ్స్ క్రియేట్ చేయించి.. పండుగకు సొంతూళ్లకు కారులో వెళ్తున్న ఓ ఫ్యామిలీ ఏపీ అభివృద్ధిపై పెదవి విరించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిట్ ఫుల్లు, ఆచరణ నిల్లు అనేలా.. ఏపీ గత ప్రభుత్వంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా తయారైంది? అనేలా పోస్టర్స్ ను జోరుగా పోస్టు చేయడంపై కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు.

నీళ్లు చల్లుతోన్న టీడీపీ..

Advertisement

కూటమి సర్కారుపై విషప్రచారం చేస్తున్న వైసీపీ నేతలకు వారి దారిలోనే కూటమి నేతలు స్ట్రాంగ్‌గా బదులిస్తున్నారు. వైసీపీ బాటలోనే వెళ్లి వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఏఐ సాయంతో.. సొంతూళ్లకు వెళ్తున్న కుటుంబాలు.. కూటమి ప్రభుత్వంలో ఏపీ ఎంతగా అభివృద్ధి చెందుతోంది.. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనా అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేసేలా వీరు సైతం సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ పోస్టర్స్ షేర్స్ చేస్తున్నారు. అసలు కూటమి సర్కారు మీద జగన్‌కు ఎందుకంత విద్వేషం అని మరికొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. తనకు ఐదేండ్ల పాటు ఏపీ ప్రజలు అవకాశమిస్తే ఏం చేశారని నిలదీస్తున్నారు.

Ravi Naidu on Roja: రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. రోజా, కొడాలి నాని, పేర్ని నాని’

Advertisement

వైసీపీ బుద్ది మారదని, ఇప్పుడిప్పుడే ఏపీకి పరిశ్రమలు, కంపెనీలు వస్తున్నాయని.. మరో పదేండ్ల పాటు కూటమి ప్రభుత్వంలో ఉంటే ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్లడం ఖాయమని, ఇందులో ఎటువంటి సందేహం లేదని కొందరు సోషల్ మీడియా వేదికగానే వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌కు తిట్ల దండకంతో బుద్ధి చెబుతున్నట్టు చర్చ జరుగుతున్నది. ఏపీలో అభివృద్ధి జరిగిందా? లేదా అనేది క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను అడిగితే తెలుస్తుందని.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని పలువురు వైసీపీ నేతలకు హితవు పలికినట్టు సమాచారం.పండుగ సెలబ్రేట్ చేసుకుందామని వచ్చిన వారి మైండ్ పొల్యూట్ చేయడం మానుకోవాలని కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×