E-Paper
Advertisement

Bengaluru Techie Case: ఆ రాత్రి ఏం చేశాడంటే.. టెక్కీని చంపిన టీనేజర్, బెంగుళూరులో దారుణం

Bengaluru Techie Case: ఆ రాత్రి ఏం చేశాడంటే.. టెక్కీని చంపిన టీనేజర్, బెంగుళూరులో దారుణం
Advertisement

Bengaluru Techie Case: బెంగుళూరులో మరణించిన మహిళా టెక్కీ కేసు కొత్త మలుపుతోంది. ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట మంటల్లో ఊపిరాడక చనిపోయిందని భావించిన పోలీసులకు అసలు విషయం తెలిసి షాకయ్యారు. ఆమె హత్యకు గురైనట్టు తేల్చారు. దీంతో టెక్కీ కేసులో తీగలాగితే డొంక కదిలింది.

Advertisement

బెంగుళూరులో దారుణం, టెక్కీని బలత్కారం చేశాడు

విచ్చలవిడిగా ఇంటర్నెట్‌, ఆ తర్వాత సోషల్‌ మీడియా ప్రభావం యువతపై బాగానే చూపుతోంది. అందుకు ఎగ్జాంఫుల్ బెంగుళూరులోకి టెక్కీ కేసు. చాలా రోజులుగా మహిళా టెక్కీపై కన్నేశారు ఓ టీనేజర్. అదను చూసి ఆమెపై విరుచుకుపడ్డాడు, చివరకు ప్రతిఘటించడంతో అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. 

Advertisement

బెంగుళూరులోని జనవరి 3న రామమూర్తి నగర్‌లోని సుబ్రమణి లే‌అవుట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 36 ఏళ్ల షర్మిల అనే యువతి చనిపోయింది. షార్ట్‌ సర్క్యూట్‌తో ఘటన జరిగిందని భావించారు. మంటలు చెలరేగడంతో ఊపిరాడక యువతి మరణించినట్లు భావించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టెక్కీని చంపేసిన టీనేజ్ కామాంధుడు

దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. ఈ క్రమంలో పక్కింట్లో ఉండే 18 ఏళ్ల యువకుడు కర్నాల్ కురై కదలికలపై కన్నేశారు. టీనేజర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్థారించారు.

కర్ణాటకలోని కొడుగు జిల్లాకి చెందిన కర్నాల్‌.. తల్లితో కలిసి సుబ్రమణి లే అవుట్‌లో అద్దెకు ఉంటున్నాడు. 18 ఏళ్ల వయస్సున్న ఈ యువకుడు నీలి చిత్రాలకు అలవాటు పడ్డాడు. పక్క ఫ్లోర్‌లో ఉన్న షర్మిల, ఆమె రూమ్ మేట్‌లపై కన్నేశాడు. తల్లి ద్వారా వాళ్లతో పరిచయం పెంచుకున్నాడు.

ఎవరీ షర్మిల? దక్షిణ కర్ణాటక ప్రాంతానికి చెందిన షర్మిల. నగరంలోని ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తోంది. సహచరులతో కలిసి యువకుడు ఉండే అపార్టుమెంటులో ఉంటోంది. ఆమె రూమ్‌మేట్‌ రెండు నెలల కిందట అస్సాంకి వెళ్లింది. షర్మిల ఒక్కరు మాత్రమే అందులో ఉన్నట్లు గుర్తించాడు. ఘటన జరిగిన రోజు రాత్రి కిటికీ ద్వారా ఫ్లాట్ లోకి చొరబడ్డాడు కర్నాల్‌.

ALSO READ: ప్రాణం తీసిన బెట్టింగ్..  చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు

తన కోరిక తీర్చమని యువతిని రిక్వెస్ట్ చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో బలత్కారం చేయబోయాడు. తీవ్రంగా ప్రతిఘటించింది షర్మిల. ఆ పెనుగులాటలో కిందపడి గాయాలుకావడంతో రక్తస్రావం అయ్యింది.  దీంతో భయపడిన ఆ యువకుడు, యువతిని గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత ఆమె బట్టలు, నేరానికి కారణమైన వస్తువులను బెడ్‌పై ఉంచి వాటికి నిప్పు పెట్టాడు.

టెక్కీ మొబైల్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఫోరెన్సిక్ నివేదికలో యువతిది హత్య అని తెలియడంతో ఇరుగు పొరుగువారి నుంచి వివరాలు సేకరించారు.  చివరకు కర్నాల్‌ వ్యవహారాలపై ఓ కన్నేశారు. యువకుడ్ని తీసుకుని విచారించారు పోలీసులు. నిజం అంగీకరించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. 

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×