E-Paper
Advertisement

Diamond Jubilee celebrations: గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో అక్కినేని నాగార్జున సందడి

Diamond Jubilee celebrations: గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో అక్కినేని నాగార్జున సందడి
Advertisement

Diamond Jubilee celebrations:  కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రతిష్టాత్మక ఏఎన్‌ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించి.. కళాశాల స్థాపన నుంచి ఇప్పటివరకు సాగిన ప్రయాణాన్ని స్మరించుకున్నారు. విద్య, సాంస్కృతిక కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం ఉత్సవ వాతావరణంతో కళకళలాడింది.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఆయనతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవానంద్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన ప్రతి సంస్థ తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. ఏఎన్‌ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

మనుషులు శాశ్వతం కాదని.. వారు చేసే పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని నాగార్జున గుర్తు చేశారు. 1951లోనే కళాశాల అభివృద్ధి కోసం అక్కినేని నాగేశ్వరరావు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు మద్దతుగా నిలవాలనే సంకల్పంతో.. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద కళాశాల విద్యార్థులకు అందించనున్న స్కాలర్‌షిప్ కోసం రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి అందించనున్న ఏఎన్‌ఆర్ కళాశాల వజ్రోత్సవ స్మారక పుస్తకాన్ని నాగార్జున ఆవిష్కరించారు. గుడివాడ ఏఎన్‌ఆర్ కళాశాల మరింత అభివృద్ధి చెందేందుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకరించాలని నాగార్జున కోరారు. ఈ వేడుకలు కళాశాల చరిత్రలో మరో మైలురాయిగా నిలిచాయి.

Advertisement

ALSO READ: Traffic Inspector Transferred: ఒక బిర్యానీ, రూ.10 వేలు లంచం.. జూబ్లిహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×