RGV on Prakasam Police: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సపరేట్. ఆయన చేసే కామెంట్స్.. వ్యవహారం ఎప్పుడూ ఓ సంచలనమే. తాజాగా ఒంగోలు పోలీసుల ముందు విచారణకు హాజరైన ఆర్జీవీ.. విచారణ తర్వాత ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కూడ తనదైన మార్క్ చూపారు ఆర్జీవీ.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఫోటోలను రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా మద్దిపాడు లో గత ఏడాది నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు రావాలని పలుమార్లు నోటీసులు అందుకున్నా, ఆర్జీవీ విచారణకు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఆర్జీవీ ఒంగోలు రూరల్ పోలీసుల ముందుకు వచ్చారు. ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.
11 గంటలకు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లిన ఆర్జీవీని పోలీసులు సుమారు 9 గంటలు విచారించారు. ప్రధానంగా అసలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందేవరు? ఎవరైనా ప్రోత్సహించారా? ఏపీ ఫైబర్ నెట్ నుండి రూ. 2 కోట్లు విడుదల చేసి ఆర్జీవీ కి ఇవ్వడంపై కూడ పోలీసులు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయితే ఆర్జీవీ సమాధానాలు ఇచ్చినప్పటికీ ఆ రూ. 2 కోట్ల విషయంలో ఆచితూచి సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే మొబైల్ ఫోన్ గురించి పోలీసులు అడగగా, తీసుకురాలేదని సమాధానం ఇచ్చినట్లు, మళ్ళీ విచారణకు వచ్చే సమయంలో తీసుకురావాలని పోలీసులు సూచించారట.
అలాగే విచారణ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన ఆర్జీవీకి గుంటూరు సీఐడీ పోలీసులు భారీ షాకిచ్చారు. ఈనెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ కి హాజరు కావాలని నోటీసు జారీ చేశారు. 2019లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఆర్జీవీ సినిమా తీయగా, తమ మనో భావాలు దెబ్బ తీసేవిధంగా సినిమా తీశారని నవంబర్ 29న సిఐడి కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఆర్జీవీని విచారణకు రావాలని నోటీసులు అందాయి.
Also Read: YS Sharmila on YS Jagan: సాయిరెడ్డి అంతా చెప్పేశారు.. జగన్ ఇక జీరో.. వైఎస్ షర్మిళ
ఇలా ఓ వైపు విచారణ ఎదుర్కొని బయటకు వచ్చిన ఆర్జీవీకి పోలీసులు షాకిస్తే, ఆయన కూడ ఓ ట్వీట్ తో పోలీసులకు షాకిచ్చారు. విచారణ అనంతరం తన ఎక్స్ ఖాతా ద్వార ఐ లవ్ ఒంగోలు.. ఐ లవ్ ఒంగోలు పోలీస్ అంటూ.. ట్వీట్ చేశారు. ట్వీట్ లో బీర్ తో నిండిన గ్లాసుల ఎమోజీలను కూడ ఆర్జీవీ పోస్ట్ చేశారు.
రామ్ గోపాల్ వర్మకు సీఐడీ నోటీసులు
ఈ నెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు
గతేడాది నవంబరు 29న నమోదైన కేసులో ఆర్జీవీకి సీఐడీ నోటీసులు
ఆర్జీవీ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని గతంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు pic.twitter.com/6QoEaq7Seq
— BIG TV Breaking News (@bigtvtelugu) February 8, 2025
దీనిని బట్టి విచారణ సంధర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరుకు లవ్ యూ చెప్పారా? లేక విచారణలో అడిగిన ప్రశ్నలకు లవ్ యూ చెప్పారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద విచారణ అనంతరం నోటీసులు అందుకున్నా.. ఆర్జీవీ ఒక్క ట్వీట్ తో తన మార్క్ చూపించారని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.
I LOVE ONGOLE 😍 AND I LOVE ONGOLE POLICE EVEN MORE😍😍. 3 CHEEERS 🍺🍺🍺 pic.twitter.com/vmjNW7ALdL
— Ram Gopal Varma (@RGVzoomin) February 7, 2025