BigTV English

Kota Srinivas Rao Death: కోట ఫ్యామిలీపై బురద జల్లే ప్రయత్నం.. తెరవెనుక వారి పనేనా?

Kota Srinivas Rao Death: కోట ఫ్యామిలీపై బురద జల్లే ప్రయత్నం.. తెరవెనుక వారి పనేనా?

Kota Srinivas Rao Death: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు- కోట వినుత దగ్గర బంధువా? ఆమె వ్యవహారంలో కోట ఫ్యామిలీపై ప్రత్యర్థులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? వినుత అరెస్టు వ్యవహారం కోట ఫ్యామిలీపై ఎలాంటి ప్రభావం చూపింది? వినుత అరెస్టు జరిగిన కొద్ది గంటల్లో కోట శ్రీనివాసరావు ఈ లోకాన్ని విడిచిపెట్టడం ఏమైనా కారణం ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


శ్రీనివాసులు హత్య వ్యవహారం జనసేన పార్టీని ఒక్కసారిగా కుదిపేస్తోంది. ఆ పార్టీ ఇన్‌ఛార్జి వినుత, చంద్రబాబు దంపతులే ఈ హత్యకు కారణమని చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ప్రకటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఆ పార్టీ నేతలు.

వినుత ఇంట్లో పదేళ్లు పని చేసిన శ్రీనివాసులు హత్య వెనుక ఏం జరిగింది? పోలీసుల విచారణలో దంపతులు నోరు విప్పారా? ఈ హత్య వెనుక అధికార పార్టీకి ఓ ప్రజాప్రతినిధి సహకరించాడనే చర్చ అప్పుడే మొదలైంది. వినుత దంపతుల వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఓ కారణమని అంటున్నారు.


శ్రీనివాసులతో తమకు ఎలాంటి సంబంధం లేదని గత నెల 22న వినుత దంపతులు ప్రకటించారు. ఈ పరిణామం జరిగిన రెండు వారాలకు అతడు చెన్నైలో విగతజీవిగా కనిపించడం అనుమానాలు మొదలయ్యాయి. వినుత దంపతులను అరెస్టు చేసిన తమిళనాడు పోలీసులు అరెస్టు, చెన్నైకి తరలించారు.

ALSO READ: కోట చివరి మాటలు.. రాజమౌళికి అన్యాయం 

ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డాయి ఏపీలో ప్రత్యర్థి పార్టీలు. కోట శ్రీనివాసరావు కుటుంబానికి దగ్గర బంధువు కోట వినుత అని కొన్ని మీడియా ఛానెళ్లు చెబుతున్నాయి. ఈ వివాదం కోట శ్రీనివాసరావు కుటుంబంపై పరోక్షంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు.

ఎందుకంటే కోట వినుత ఆయన కుటుంబ సభ్యురాలని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఆమె అరెస్టు జరిగిన కొద్ది గంటల్లోనే కోట శ్రీనివాసరావు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో కోట బాధపడుతున్నారు. ఆయనకు వినుత కేసుకు లింకు పెట్టేశాయి ఏపీలోని కొన్ని ఛానెళ్లు.

ఇందులో నిజమెంతో తెలీదుగానీ, ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్లాన్ చేశాయి ప్రత్యర్థి పార్టీలు. మరి చెన్నై పోలీసుల విచారణలో తీగలాడితే ఇంకెన్ని కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

Ayyanna Patrudu: స్పీకర్ సంచలన వ్యాఖ్యలు.. వరాలిచ్చే అధికారం తనకు లేదు, జగన్‌ నిర్ణమేంటి?

Tirupati To Shirdi: తిరుపతి నుంచి షిర్డీకి ప్రతీ రోజూ ట్రైన్.. సీఎం చంద్రబాబు సూచన, రైల్వేశాఖ ఆమోదం

TTD EO: టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్.. వైసీపీకి చెమటలు, ఈసారైనా ప్రక్షాళన జరిగేనా?

YS Raja Reddy: రాజారెడ్డికి అమ్మమ్మ ఆశీర్వాదం.. తల్లితోపాటు అక్కడికి, జగన్ టీమ్‌లో కలకలం

CM Progress Report: ఏపీలో ఫేక్ న్యూస్‌పై ఫైట్ షురూ.. సీఎం సంచలన నిర్ణయం..

Road accident: మద్యం మత్తులో కారు డ్రైవర్.. ఏకంగా ముగ్గురి ప్రాణాలు బలి.. విజయనగరంలో ఘటన!

Big Stories

×