Kota Srinivas Rao: నటుడు కోట శ్రీనివాసరావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. దాని వెనుక ఆయన కష్టపడిన కష్టం అంతా ఇంతా కాదు. మూడు దశాబ్దాల పాటు డ్రామా ఆర్టిస్టుగా అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా తన గురించి మాత్రమేకాదు.. చిత్ర పరిశ్రమ గురించి కీలక విషయాలు బయటపెట్టారు ఆయన.
1958లో డ్రామా ఆర్టిస్టుగా అడుగుపెట్టిన ఆయన 1986 వరకు కొనసాగించారు. నటుడు కావాలని తాను ఏనాడు అనుకోలేదు. బ్యాంకు ఉద్యోగి నుంచి అనుకోకుండా వెండితెరపై వచ్చారు. 1978లో వెండితెరపై అడుగుపెట్టారు కోట. ప్రతిఘటన సినిమా కోట వెండితెర కెరీర్ మలుపు తిప్పింది.
వెండితెరపై ఐదు రకాల సినిమాలు ఉండేవని కనిపించేవని, రాను రాను ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. అప్పట్లో సినిమా ప్రభావం మనుషులపై ఉండేదని, ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమాపై పడిందని అన్నారు. తనకంటే కోట గొప్ప నటుడని ఒకానొక సందర్భంలో కైకాల సత్యనారాయణ అన్నారు. తాను అదొక సర్టిఫికెట్‌గా భావించానని మనసులోని మాట బయపెట్టారు.
అప్పటి సినిమాలు వేరని.. ఇప్పుడు చిత్ర పరిశ్రమ వ్యాపారంగా మారిందన్నారు. తెలుగులో సినిమాలు తీస్తే అవార్డులు వస్తాయని, ఈ విషయంలో దైర్యం చేస్తే సక్సెస్ అవుతుందన్నారు. ఫలానా బ్యానర్ నుంచి సినిమా వస్తుంటే ఆసక్తికరంగా ఉండేదని, ఇప్పుడు సినిమాల్లో అసలు కథ లేదని తేల్చేశారు.
ALSO READ: కోటా వల్లే బెడవాడలో ఆ పార్టీ జెండా రెపరెపలు
ఫిల్మ్ఇండస్ట్రీ గురించి అంతర్గత విషయాలను ఆయన బయటపెట్టారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎవరూ లేరన్నారు. ఆయనకు ఏం గౌరవం జరిగిందని, కర్ణాటక తరపున పద్మశ్రీ అవార్డు వచ్చిందన్నారు. కోట చివరి సినిమా ‘హరిహర వీరమల్లు’. అందులో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. మరి చివరి మూవీ ఆయనకు ఎలాంటి పేరు తెస్తుందో చూడాలి.