BigTV English

Sharmila – YS Jagan: ఆస్తుల మొత్తమెంత? చిక్కంతా వాటాల దగ్గరే.. రెండా, మూడా?

Sharmila – YS Jagan: ఆస్తుల మొత్తమెంత? చిక్కంతా వాటాల దగ్గరే.. రెండా, మూడా?

Sharmila – YS Jagan: వైఎస్ఆర్ ఆస్తుల వ్యవహారం ఎంత వరకు వచ్చింది? ఇంతకీ ఆస్తులెన్ని? ఎన్ని వాటాలు వేస్తున్నారు? రెండా.. మూడా? రెండయితే విజయమ్మ మాటేంటి? దీనిపై ఇరువర్గాలేమంటున్నాయి? విదేశాల్లో ఉన్న ఆస్తుల మాటేంటి? అన్నదే అసలు ప్రశ్న.


వైఎస్ఆర్ ఆస్తులపై ఫ్యామిలీలో రచ్చ కంటిన్యూ అవుతోంది. సోమవారం ఓ తెలుగు డైలీ పేపర్ కథనం తర్వాత… వైఎస్ ఫ్యామిలీలో ఆస్తులపై చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి. కొన్ని మాత్రమే ఫ్యామిలీ సభ్యులకు తెలిసినట్టు సమాచారం. మిగతా ఆస్తుల మాటేంటి? అన్నదే అసలు ప్రశ్న. ఈ విషయాలన్నీ విజయమ్మకు తెలుసా? వైఎస్ఆర్‌కు ఎంత ఆస్తులున్నాయి, దేశంలో కాకుండా విదేశాల్లో ఏమైనా ఉన్నాయా?

దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటకతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో ఆస్తున్నాయన్నది కొందరి నేతల మాట. సింగపూర్‌తో‌పాటు మరో దేశంలో ఆస్తులున్నట్లు చెప్పుకొచ్చారు. పైకి మాత్రం 2009 ఎన్నికల అఫిడవిట్ మాదిరిగా లెక్క చెబుతారని అంటున్నారు.


అంతర్గతంగా లోటస్ పాండ్ షర్మిలకు వస్తే.. యలహంక జగన్ వెళ్లవచ్చన్నది ఆయా నేతల మాట. మరి విజయమ్మ సంగతేంటన్నది కొందరి ప్రశ్న. భర్త ఆస్తి.. పిల్లలతోపాటు తల్లికీ వాటా వేయాల్సిందేనని అంటున్నారు. ఆ లెక్కన అంతర్గత ఆస్తులు మాత్రం మూడు వాటాలు వేయాల్సిందేనని అంటున్నారు. దీనికి జగన్‌బాబు ఏమంటున్నారు?

ALSO READ : మాజీ ఎంపీకి మరిన్ని కష్టాలు.. సోదాలపై ఈడీ క్లారిటీ, ఎంవీవీ మునిగిపోయినట్టేనా?

ఎందుకంటే విజయమ్మ తన కూతురు వద్ద ఉంటున్నారు. ఫ్యామిలీలో అంతర్గత కలహాల ప్రారంభించినప్పటి నుంచి కొడుకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్యలో ఒకసారి కొడుకు వద్దకు తల్లి వెళ్లినట్టు వార్తలొచ్చాయి. ఆస్తిలో తల్లికి వాటా ఇస్తే.. చెల్లికి వెళ్లిపోవచ్చన్నది వారి అన్న ఆలోచన. దీనికి ససేమిరా అంటున్నట్లు బెంగుళూరు సమాచారం. తనకు ఎక్కువ వాటా ఇవ్వాల్సిందేనన్నది జగన్ మాటగా చెబుతున్నాయి.

2012లో జగన్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 757 కోట్లు రూపాయలున్నట్లు ప్రస్తావించారు. వైఎస్ఆర్ ద్వారా వచ్చిన ఆస్తా? జగన్ రాజకీయాల్లోకి రాకముందు కూడబెట్టిన ఆస్తా? అనేదానిపై స్పష్టత లేదు. అలాగే జగన్ భార్య పేరిట కొన్ని ఆస్తులు, కంపెనీల షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం విజయమ్మ పేరిట ఎంత ఆస్తి ఉందన్నది స్పష్టత లేదు.

 

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×