IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) టోర్నమెంట్ కంటే ముందు… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (royal challengers benguluru ) జట్టుకు కొత్త చిక్కులు వస్తున్నాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి… తాజాగా ఆర్సిబి జట్టుకు కొన్ని సూచనలు వచ్చాయట. నాన్ లోకల్ ప్లేయర్లను… వదిలేసి కేవలం కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్లేయర్లను ఎక్కువగా.. రిటైన్ చేసుకోవాలని…. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డిమాండ్ తెరపైకి తీసుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక ప్లేయర్లకు ఛాన్సులు ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో… కాంగ్రెస్ ( congress) ప్రభుత్వం.. ఈ వాదనతో ముందుకు వచ్చిందట.
Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !
వాస్తవంగా దాదాపు 17 సీజన్లుగా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు (rcb)… ఒక్క టోర్నీ కూడా గెలవలేదు. ఈసారైనా కచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో…. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందుకు వెళ్తోంది. ఆ దిశగా ప్లేయర్లను కూడా రెడీ చేసేందుకు జట్టు యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. మంచి ప్లేయర్లను తీసుకొని.. అవసరం లేదనుకున్న వాళ్లను వదిలేయాలని కూడా ప్లాన్ చేస్తోంది ఆర్ సి బి యాజమాన్యం.
అక్టోబర్ 31వ తేదీ లోపు… ఏ ప్లేయర్ ను తీసుకుంటున్నారు…? ఏ ప్లేయర్ ను వదిలేస్తున్నారు అనే వివరాలను కచ్చితంగా బీసీసీఐ (bcci )ముందు వివరించాలి. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఉన్న పది జట్ల ఫ్రాంచైజీలు… రిటెన్షన్ లిస్టును తయారు చేస్తున్నాయి. మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో… భారీగా కసరత్తు చేస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు… అక్కడి కర్ణాటక ప్రభుత్వం.. షాక్ ఇచ్చింది.
Also Read: IND VS NZ: గెలుపు జోష్ లో ఉన్న న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ.. కీలక ప్లేయర్ దూరం!
తాము చెప్పిన ప్లేయర్లని… రిటైన్ చేసుకోవాలని డిమాండ్ చేస్తుంది. కర్ణాటక ప్లేయర్లు అయిన విజయ్ కుమార్ (vijay kumar), అలాగే మనోజ్ బండాగే (manoj bhandage ) ఇద్దరు ప్లేలను కచ్చితంగా ఆర్ సి బి రిటైన్ చేసుకోవాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీస్తోందట. ఇతర ప్లేయర్లను వదులుకొని… కేవలం లోకల్ ప్లేయర్స్ మాత్రమే ఆడాలని అంటుంది కర్ణాటక. ఈ డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు కొత్తగా కర్ణాటక ప్రభుత్వం ఇది తీసుకురాలేదు.
అయితే కర్ణాటక ప్రభుత్వం చెబుతున్న ప్రకారం… చేస్తే తమ జట్టుకు నష్టం జరుగుతుందని ఆర్సిబి యాజమాన్యం భావిస్తోంది. తమకు నచ్చిన ప్లేయర్లను అలాగే టాలెంట్ ఉన్న వాళ్లను మాత్రమే తీసుకుంటామని చెబుతోంది. దాని ప్రకారం విరాట్ కోహ్లీ ( virat kohli ) మహమ్మద్ సిరాజ్, మ్యాక్సీ మామ, గ్రీన్, రజత్ లాంటి ప్లేయర్లనే తీసుకుంటామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం భావిస్తోందట. ఎవరని అడ్డంకులు సృష్టించిన తమ ప్లేయర్లను మార్చేది లేదని చెబుతోంది అట. దీంతో కర్ణాటకలోని ఆర్సిబి జట్టు పరిస్థితి… గందరగోళంగా ఉంది.