UnstoppableS4 Promo..నటసింహా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఒకవైపు హీరో గానే కాకుండా మరొకవైపు రాజకీయ నేతగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. హిందూపురం నియోజకవర్గం నుండి ఏకంగా మూడుసార్లు పోటీ చేసి హ్యాట్రిక్ విజయం అందుకున్న ఈయన అటు అసెంబ్లీలో కూడా తన మార్క్ చూపించిన విషయం తెలిసిందే. ఒకవైపు తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ తన పరిపాలనలో కూడా ప్రజలకు మంచి చేకూర్చారు. ముఖ్యంగా హాస్పిటల్స్ కూడా నిర్మించి, వారికి అండగా నిలిచారు. ఇలా ఒకవైపు హీరోగా, మరొకవైపు రాజకీయ నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్న బాలకృష్ణ (Balakrishna ) ఇప్పుడు హోస్ట్ గా కూడా మారిన విషయం తెలిసిందే.
అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో..
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అంటూ సెలబ్రిటీ టాక్ షో ను ప్రకటించి బాలయ్య హోస్ట్ గా చేస్తారని చెప్పినప్పుడు చాలామంది ఎన్నో విమర్శలు చేశారు. కానీ ఒక్కసారి షో ప్రారంభమైన తర్వాత టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. అంతే కాదు దేశంలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ నమోదు చేసుకున్న షోగా నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా 18వ స్థానాన్ని దక్కించుకోవడం ఆయన టాలెంట్ కి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇకపోతే 3 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాల్గవ సీజన్ కూడా మొదలైంది. నాలుగవ సీజన్ మొదటి ఎపిసోడ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు.
బావగారిని ఆప్యాయంగా ఆహ్వానించిన బాలకృష్ణ..
ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం ఈ షూటింగ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా.. ఇప్పుడు ఎపిసోడ్ ప్రోమోని కూడా తాజాగా విడుదల చేశారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 4 కి సీఎం రావడంతో షోపై ఆసక్తి నెలకొంది. ఈనెల 25వ తేదీన నాల్గవ సీజన్ మొదటి ఎపిసోడ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా ప్రోమో ను విడుదల చేశారు.ఇక ప్రోమో విషయానికి వస్తే.. మా బావగారు.. మీ బాబు గారు.. చంద్రబాబు నాయుడు గారు అంటూ నారా చంద్రబాబు నాయుడుని ఆప్యాయంగా ఆహ్వానించారు బాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ హయాంలో కక్ష రాజకీయాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. నేను మాత్రం లక్ష్మణ రేఖ దాటను.. తప్పు చేస్తే మాత్రం వదలను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు.
బాలయ్య షోలో పవన్ ప్రస్తావన..
అలాగే బాలయ్య మాట్లాడుతూ.. ఆకాశంలో సూర్యచంద్రులు.. ఆంధ్రాలో పవన్ బాబు , చంద్రబాబులు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి అనగా.. చంద్రబాబు మాట్లాడుతూ.. మీరు ఎలాగైతే సినిమాలలో అన్ స్టాపబుల్ గా ఉన్నారో.. రాజకీయాల్లో నేను కూడా అన్ స్టాపబుల్ అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ పేరు కూడా తీయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే నందమూరి, నారా, మెగా అభిమానులు ఈ మొదటి ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ప్రోమోతోనే ఎపిసోడ్ పై హైప్ పెంచేశారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">