Divvala Madhuri Roja Controversy: నేను చేస్తే మీకు రోతలా కనిపిస్తుందా? అదే మాజీ మంత్రి అయినటువంటి ఆమె చేస్తే ముద్దుగా ఉందా అంటూ ఓ మహిళా సెలబ్రిటీ దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఒక నటిగా, హీరోయిన్ గా ఎన్నో చిత్రాలలో నటించిన ఆమెను, అలా అనడం, అంతేకాకుండా తామేమి తక్కువ కాదని సదరు సెలబ్రిటీ రెచ్చిపోవడంతో.. ఆ వీడియో చూసిన వారు.. ఇది కూడా కరెక్ట్ కదా సార్ అంటూ వీడియోకు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఈ కామెంట్స్ చేసిన ఆ సెలబ్రిటీ ఎవరో కాదు.. అనూహ్యంగా రాజకీయ తెరపై మెరిసిన దివ్వెల మాధురి. ఇంతకు ఈమె విమర్శలు గుప్పించింది ఎవరిపైనో కాదు.. ఏకంగా మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజాపైనే.
తగ్గేదెలే అంటున్న దివ్వెల మాధురి..
దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం వివాదంగా మారిన సమయంలో మాధురి పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు దువ్వాడ తో జత కలిసి త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమని ఆ సమయంలో మాధురి చేసిన కామెంట్స్ ఓ సంచలనమే. అయితే మాధురి, శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్లడం కామన్ గా మారింది. ఎవరైనా దువ్వాడ ను టార్గెట్ చేస్తే చాలు, మాధురి ఓ రేంజ్ లో కామెంట్స్ చేయడం అలవాటుగా మారింది.
డ్యాన్స్ లతో అదరగొడుతున్న జంట..
ఇటీవల పలు వేదికల మీద దువ్వాడ, దివ్వెలా జంటగా డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు వీరిద్దరూ సోషల్ మీడియాలో సైతం జంటగా రీల్స్ చేయడం కూడా ఇటీవల కామన్ గా మారింది. స్వతహాగా డ్యాన్సర్ అయిన మాధురి వేసే స్టెప్స్ కి వ్యూస్ కూడా అంతేస్థాయిలో వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ జంటగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మాధురి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
Also Read: Talliki Vandanam Scheme: మీకు తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా? కారణం ఇదే కావచ్చు..!
సస్పెండ్ తో ప్రారంభమైన వివాదం
ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. ఇదే విషయాన్ని సదరు యాంకర్ ప్రస్తావిస్తూ.. ఇద్దరు కలిసి డ్యాన్సులు వేయడం, అవి వైరల్ కావడంతో పార్టీ నుండి సస్పెండ్ చేశారట కదా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు దువ్వాడ సైలెంట్ గా ఉన్నా, మాధురి మాత్రం ఓ రేంజ్ లో ఇచ్చి పడేశారు.
రోజా చేస్తే బాగుంటుందా?
మాధురి మాట్లాడుతూ.. తామిద్దరం చేస్తే తప్పు, అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి రోజా స్టెప్స్ వేస్తే ఆహా.. ఓహో అంటారా అంటూ ఫైర్ అయ్యారు. పలు టీవీ షోలలో రోజా డ్యాన్స్ లు చేయలేదా అంటూ ఆమె ప్రశ్నించారు. తాము రీల్స్ చెయ్యడమే సస్పెండ్ కు కారణం అయితే, మరి చాలా మందిని సస్పెండ్ చేయాల్సి ఉంటుందని మాధురి ఆ వీడియోలో అన్నారు. తాము ఇద్దరం న్యాయ సమస్యలు పరిష్కారం అయిన వెంటనే, పెళ్లి చేసుకుంటామని.. కానీ తాము స్టెప్స్ వేస్తే ఏదో కొంపలు మునిగి పోయాయని ప్రచారం చేయడం తగదన్నారు. మొత్తం మీద మాధురి ఒక్కసారిగా రోజా పేరు తీసుకురావడంతో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.