Tanveer Ahmed On Asia Cup 2026 Finals: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ ( Asia Cup 2026 Finals) మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా ఉమెన్స్ వర్సెస్ శ్రీలంక ఉమెన్స్ టీమ్స్ మధ్య ఈ ఫైనల్స్ ప్రారంభం కానుంది. 8 గంటల ప్రాంతంలో ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిక్సింగ్ చేసి ఫైనల్స్ కు టీమిండియా వచ్చిందని బాంబు పేల్చారు. ఫిక్సింగ్ చేసి వచ్చినప్పటికీ.. ఫైనల్స్ లో టీమిండియా ఉమెన్స్ టీం ఓడిపోవడం గ్యారంటీ అని సవాల్ విసిరారు. ఈ ఫైనల్స్ లో శ్రీలంక చేతిలో టీమిండియా గనక గెలిస్తే.. తాను బట్టలు లేకుండా పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతానని చాలెంజ్ విసిరారు. దీంతో ఆసియా కప్ ఫైనల్స్ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మరికొన్ని గంటల్లో ఆసియా కప్ ఉమెన్స్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఫైనల్స్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. సెమీ ఫైనల్ సందర్భంగా పాకిస్తాన్ మహిళల జట్టు.. శ్రీలంక చేతిలో ఓడిపోవడం చాలా బాధాకరమన్నారు. దీంతో ఆసియా కప్ ఫైనల్స్ బరి నుంచి పాకిస్తాన్ తప్పుకుందని చెప్పుకొచ్చారు. తమ జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తన్వీర్ అహ్మద్, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక గెలిచేలా బీసీసీఐ కుట్రలు చేసిందని బాంబు పేల్చారు. లేకపోతే సెమీఫైనల్స్ లో పాకిస్తాన్ గెలిచేది అన్నారు. అంపైర్ల ను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారని.. అందుకే పాకిస్తాన్ సెమీఫైనల్స్ లో ఓడిపోయిందని షాకింగ్ ఆరోపణలు చేశారు.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లోకి పాకిస్తాన్ వస్తే టీమిండియా ఓడిపోయేదని తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఆ భయంతోనే సెమీఫైనల్స్ లోనే పాకిస్తాన్ జట్టును ఇంటికి పంపించారని బాంబు పేల్చారు. అయినప్పటికీ ఫైనల్స్ లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అని తెలిపారు. పాకిస్తాన్ అభిమానులందరూ శ్రీలంక గెలిచేలా ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. ఒకవేళ ఆసియా కప్ ట్రోఫీని మహిళల టీమిండియా గెలిస్తే.. బట్టలు లేకుండా పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతానని చాలెంజ్ విసిరారు తన్వీర్ అహ్మద్ ( Tanveer ahmed). దీంతో ఆసియా కప్ ఫైనల్స్ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.