E-Paper
Advertisement

అన్ని అకౌంట్లకూ ఒకే పాస్‌వర్డ్ వాడేస్తున్నారా? జాగ్రత్త

అన్ని అకౌంట్లకూ ఒకే పాస్‌వర్డ్ వాడేస్తున్నారా? జాగ్రత్త
Advertisement

Risks of using same password: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. మనం ప్రతి చిన్న.. పనికి ఒక యాప్ లేదా వెబ్‌సైట్‌ను వాడుతున్నాం. ఈ-కామర్స్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌లు, ఆన్‌ లైన్ బ్యాంకింగ్, ఆఫీస్ లాగిన్‌లు.. ఇలా ప్రతీ చోటా లాగిన్ అవ్వాలంటే పాస్‌వర్డ్ తప్పనిసరి. ఇన్ని పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం కష్టమని చాలా మంది యూజర్లు అన్ని అకౌంట్లకూ ఒకే పాస్‌వర్డ్‌ను వాడేస్తుంటారు. ఇది ఈజీగా అనిపించినప్పటికీ, సేఫ్టీ పరంగా ఇది అత్యంత ప్రమాదకరమైన ఆలోచన. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అన్ని చోట్లా ఒకే పాస్‌వర్డ్ వాడితే జరిగే నష్టాలు:

1. డొమినో ఎఫెక్ట్ :

మీరు వాడే ఏదో ఒక చిన్న థర్డ్-పార్టీ వెబ్‌సైట్ డేటా బ్రీచ్‌కి గురైందని అనుకుందాం. అక్కడ మీరు వాడిన అదే పాస్‌ వర్డ్ హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. ఇక హ్యాకర్లు ఆ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి మీ జీమెయిల్, సోషల్ మీడియా అకౌంట్లు, చివరికి మీ బ్యాంకింగ్ యాప్‌లను కూడా ఒక్క క్షణంలో హ్యాక్ చేసేస్తారు.ఒక్క అకౌంట్ పోతే అన్నీ వరుసగా హ్యాక్ అవుతాయి.

2. ఆర్థిక మోసాలు:

Advertisement

మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ యాప్స్‌కి కూడా ఇదే పాస్‌వర్డ్ ఉంటే.. మీ కష్టార్జితం మొత్తం క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. అంతే కాకుండా మీ సోషల్ మీడియా అకౌంట్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని మీ పేరుతో.. మీ ఫ్రెండ్స్‌కి మెసేజ్‌లు చేసి డబ్బులు అడిగే సైబర్ నేరాలకు పాల్పడతారు.

3.ప్రైవసీ :

మీ పర్సనల్ ఫొటోలు, సీక్రెట్ చాట్స్, అధికారిక ఈ మెయిల్స్ అన్నీ హ్యాకర్ల చేతికి చిక్కితే మీ వ్యక్తిగత స్వేచ్ఛ పూర్తిగా దెబ్బతింటుంది. మిమ్మల్ని బ్లాక్‌ మెయిల్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.

Advertisement

Also Read: ఫ్రిజ్‌లో నీరు చేరుతోందా? టెక్నీషియన్‌ను పిలవకుండానే ఇలా సాల్వ్ చేయండి!

 స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సృష్టించుకునే మార్గాలు:

1.ఈ ప్రమాదాలన్నింటి నుంచి తప్పించుకోవడానికి మీరు కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి.

2.పాస్‌ఫ్రేజ్ టెక్నిక్: కేవలం అంకెలు, అక్షరాలు కాకుండా.. ఒక చిన్న వాక్యాన్ని పాస్‌వర్డ్‌గా పెట్టుకోండి. ఉదాహరణకు సాధారణ పదాలకు బదులుగా గుర్తుంచుకోగలిగేలా కొన్ని పదాలను వాడండి.

3.ప్రత్యేక అక్షరాల వాడకం : మీ పాస్‌వర్డ్‌లో క్యాపిటల్ లెటర్స్ (A-Z), స్మాల్ లెటర్స్ (a-z), నంబర్స్ (0-9) స్పెషల్ క్యారెక్టర్స్ (!@#$%) అన్నీ కలిసేలా చూసుకోండి. దీని వల్ల హ్యాకర్లు ‘బ్రూట్ ఫోర్స్’ పద్ధతిలో పాస్‌ వర్డ్‌ను క్రాక్ చేయడం అసాధ్యం అవుతుంది.

4.పాస్‌వర్డ్ మేనేజర్లు : ప్రతీ అకౌంట్‌కి వేర్వేరు, కఠినమైన పాస్‌ వర్డ్‌లు పెట్టుకుని గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి, గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ లేదా బిట్‌వార్డెన్ లాంటి ట్రస్టెడ్ పాస్‌వర్డ్ మేనేజర్లను వాడండి. ఇవి మీ పాస్‌ వర్డ్‌లను సేఫ్ గా ఉంచుతుంది.

5.”కన్వీనియన్స్” కంటే “సెక్యూరిటీ” (సేఫ్టీ) చాలా ముఖ్యం.ఇప్పటికైనా మీ అన్ని అకౌంట్లకూ.. ఒకే పాస్‌వర్డ్ వాడే అలవాటు ఉంటే వెంటనే.. మార్చేయండి. బలమైన, వేర్వేరు పాస్‌వర్డ్‌లతో.. మీ డిజిటల్ జీవితాన్ని సేఫ్టీగా ఉంచుకోండి.

Related News

DSLR కెమెరాలకు గట్టిపోటీ ఇవ్వనున్న iQOO 16.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

ఒప్పో ఫైండ్ N6 vs మోటరోలా రేజర్ ఫోల్డ్.. ఈ రెండింటిలో ఫీచర్లు, కెమెరా, డిజైన్ పరంగా ఏది బెటర్?

ఫోన్‌లో..కనిపించే ఈ 5 వార్నింగ్ సిగ్నల్స్ మీకు తెలుసా?

7,500mAh బ్యాటరీ.. డైమెన్సిటీ 9600M చిప్‌తో అదరగొట్టనున్న Vivo X500 ఫోన్!

ఫ్రిజ్‌లో నీరు చేరుతోందా? టెక్నీషియన్‌ను పిలవకుండానే ఇలా సాల్వ్ చేయండి!

టాప్ 5 ఏఐ టూల్స్..ఈ ట్రిక్స్ తెలిస్తే వర్క్ చిటికెలో అయిపోతుంది!

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్.. నాయిస్ నుంచి అదిరిపోయే ఉమెన్స్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×