BigTV English

AP DGP met Dy Cm pawan: డీజీపీగా బాధ్యతలు తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ

AP DGP met Dy Cm pawan: డీజీపీగా బాధ్యతలు తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ

AP DGP met Dy Cm pawan: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్చీ పుష్పగుచ్చం అందించి కొత్త డీజీపీకి స్వాగతం పలికారు.


అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారులతో ద్వారకా తిరుమలరావు సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు డీజీపీ. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సమావేశమయ్యారాయన.

1986 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు. తొలుత కర్నూలు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కామారెడ్డి, ధర్మవరంలోనూ పనిచేసిన అనుభవం ఆయన సొంతం. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం ఏఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అక్కడి నుంచి ఎస్పీగా పదోన్నతి పొందాక మెదక్, కడప, అనంతపురం, విజయవాడ విధులు నిర్వహించారు.


ALSO READ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ముద్రగడ సలహా..ఏంటో తెలుసా?

ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో ఐజీగా పనిచేశారాయన. అంతేకాదు ఉమ్మడి ఏపీలో సైబరాబాద్ కమిషనర్ గా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఏపీకి వచ్చారు. తొలుత విజయవాడ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల కిందట ఆర్టీసీ ఎండీగాఉన్నారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం ఆయన్ని నియమించింది. రాష్ట్రంలో సీనియార్టీ ప్రకారం మొదటి ప్లేస్‌లో ఉన్నారు.

Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×