E-Paper
Advertisement

East Godavari: రాములోరి కల్యాణానికి గోటితో కోటి తలంబ్రాలు.. మహా యజ్ఞానికి వానరసేన శ్రీకారం

East Godavari: రాములోరి కల్యాణానికి గోటితో కోటి తలంబ్రాలు.. మహా యజ్ఞానికి వానరసేన శ్రీకారం
Advertisement

East Godavari: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో.. రాములోరి కల్యాణానికి కోటి తలంబ్రాల మహా యజ్ఞానికి వానర సేన శ్రీకారం చుట్టింది. శ్రీరాముడు, సీత, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగజుడు వేషధారణలో రామనామంతో వరికోత కోసి వానర సైన్యం కుప్పవేశారు. వరి కుప్పపై శ్రీరాముడు, సీత వేషధారణలో ఉన్న వారికి హారతి ఇచ్చి, కోటితలంబ్రాల మహాయజ్ఞం చేపట్టారు. 15వ సారి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యకు వరి వడ్లను గోటితో వలచి పంపే కోటి తలంబ్రాల కార్యక్రమాన్ని వానర సేన శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా 1.65 సెంట్ల భూమిలో పండించిన పంటను కోసం కుప్పనూరుస్తారు. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని గోటితో వలచి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యకు పంపిస్తారు. భద్రాద్రి, ఒంటి మిట్టి, అయోధ్యకు వరుసగా 15వ సారి కోటి తలంబ్రాలను పంపనున్నారు. కుప్ప చుట్టూ శ్రీరాముడు, సీత, వానర సేన వేషధారణలో ప్రదక్షిణ చేసి కోటి తలంబ్రాల పంటను సిద్ధం చేశారు.

ప్రతీ ఏటా ప్రత్యేక కార్యక్రమం

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపురం కేంద్రంగా శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ఒక ప్రత్యేక కార్యక్రమం చేపడతారు. సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పించేందుకు శ్రీరాముడు, సీత, వానరాల వేషధారణలో భక్తులు పంటను కోసి ధాన్యాన్ని శుద్ధి చేసి భద్రాద్రి, ఒంటిమిట్ట, అయోధ్య శ్రీరాముడికి సమర్పిస్తారు. గోటితో వడ్లను వలచి, తలంబ్రాలు సిద్ధం చేస్తారు. తలంబ్రాలు కోసం ప్రత్యేకంగా పంటను వేస్తారు. ఎంతో భక్తి భావంతో పంటను సిద్ధం చేస్తారు. ఆ పంట కోత ప్రక్రియను ఇటీవల చేపట్టారు. పంటను కోసి కుప్పంగా వేసి నూర్చారు. ఆ ధాన్యాన్ని గోటితో వలచి కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తారు.

Advertisement

Also Read: Dallas News: క్లారిటీ ఇచ్చేసిన మంత్రి లోకేష్.. వైసీపీ నేతలకు కష్టాలు, సప్తసముద్రాల అవతలున్నా

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×