E-Paper
Advertisement

T20 World Cup 2026 : జియో హాట్ స్టార్ తప్పుకోవడంతో నష్టపోయేది వీళ్లే.. పోటీ పడుతున్న ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్?

T20 World Cup 2026 : జియో హాట్ స్టార్ తప్పుకోవడంతో నష్టపోయేది వీళ్లే.. పోటీ పడుతున్న ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్?
Advertisement

T20 World Cup 2026 : వ‌చ్చే ఏడాది టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ స్ట్రీమింగ్ బాధ్య‌త‌ల నుంచి జియో హాట్ స్టార్ త‌ప్పుకున్న‌ట్టు నేష‌న‌ల్ మీడియా వెల్ల‌డించింది. రెండేళ్ల అగ్రిమెంట్ ఉన్న‌ప్ప‌టికీ తీవ్ర‌మైన ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో కొన‌సాగ‌లేమ‌ని ఐసీసీకి స‌మాచారం ఇచ్చిన‌ట్టు పేర్కొంది. దీంతో నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ పిక్చ‌ర్స్ రేసులోకి వ‌చ్చిన‌ట్టు తెలిపింది. ఇదే వాస్త‌వమే అయితే టోర్నీ వీక్షించ‌డానికి స‌బ్ స్క్రిప్ష‌న్ తీసుకోవాల్సిందే. దీంతో ప్రేక్ష‌కుల జేబుకు చిల్లు ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు జియో హాట్ స్టార్ వైదొలగడంతో ఇప్పటికే సబ్ స్క్రిప్షన్ చేసుకున్న వాళ్లు, మళ్లీ చేసుకోవాల్సి వస్తుంది.

Also Read : IND VS SA T20I Series: రేప‌టి నుంచే 5 టీ20ల సిరీస్‌..మ్యాచ్ టైమింగ్స్, షెడ్యూల్‌..ఉచితంగా ఎలా చూడాలంటే

Advertisement

ఒక‌వేళ టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ను ప్రైమ్ వీడియో లేదా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేస్తే.. దానిని మ‌ళ్లీ క్రికెట్ అభిమానులు స‌బ్ స్క్రిప్ష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండు సార్లు స‌బ్ స్క్రిప్ష‌న్ చేసుకొని న‌ష్ట‌పోతున్నారు ప్ర‌జ‌లు. ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు అయితే భారీ న‌ష్ట‌మ‌నే చెప్పవ‌చ్చు. రెండేళ్ల కాలం లో అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తీవ్రమైన ఆర్థిక సమస్యల కారణంగా కొనసాగలేమని ఐసీసీకి సమాచారం ఇచ్చిందట జియో హాట్ స్టార్. వాస్తవంగా ఐసీసీతో మూడు బిలియన్ల మీడియా హక్కులను జియో హాట్ స్టార్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. 2027 వరకు జియో హాట్ స్టార్‌ కొనసాగాలి. కానీ ఆర్థిక నష్టాల కారణంగా ఏడాది ముందుగానే జియో హాట్ స్టార్‌ వైదొలిగినట్లు సమాచారం. ముఖ్యంగా వ‌చ్చే ఏడాది జ‌రుగ‌బోయే టీ-20 ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

ఈ టోర్న‌మెంట్ కి భార‌త్, శ్రీలంక రెండు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 07 నుంచి మార్చి 08 వ‌ర‌కు ఈ టోర్న‌మెంట్ కొనసాగ‌నుంది. ఈ టోర్నీలో భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 15న కొలొంబో వేదిక‌గా జ‌రుగ‌నుంది. గ‌తంలో జ‌రిగిన‌ట్టే ఈ సారి కూడా టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో 20 దేశాలు పాల్గొన‌బోతున్నాయి. ఈ 20 జ‌ట్ల‌ను నాలుగు గ్రూపులుగా విభ‌జించారు. ప్ర‌తి గ్రూపు నుంచి 2 జ‌ట్లు సూప‌ర్ 8 కి అర్హ‌త సాధిస్తాయి. ఆ త‌రువాత సూప‌ర్ 08 లోని నాలుగు జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జిస్తారు. ఇందులో టాప్ 2 జ‌ట్లు సెమీ ఫైన‌ల్ కి అర్హ‌త సాధిస్తాయి. సెమీ ఫైన‌ల్ లో విజ‌యం సాధించిన రెండు జ‌ట్లు ఫైన‌ల్ కి చేరుకుంటాయి. ఈ మ్యాచ్ లు భార‌త్ లోని అహ్మ‌దాబాద్, ముంబయి, ఢిల్లీ, కోల్ క‌తా, చెన్నై వేదిక‌ల్లో జ‌రుగుతాయి. అలాగే శ్రీలంక‌లోని కొలొంబోలోని రెండు స్టేడియాలు, క్యాండీలోని ప‌ల్లెకెలె స్టేడియంలో మ్యాచ్ లు జ‌రుగ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 07న యూఎస్ఏతో, ఫిబ్ర‌వ‌రి 12న న‌మీబియాతో, ఫిబ్ర‌వ‌రి 15న పాకిస్తాన్ తో, ఫిబ్ర‌వ‌రి 18న నెద‌ర్లాండ్ తో గ్రూపు ద‌శ‌లో మ్యాచ్ లు ఆడ‌నుంది టీమిండియా. ఈ నేప‌థ్యంలోనే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ల స్ట్రీమింగ్ నుంచి జియో హాట్ స్టార్ త‌ప్పుకోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

Advertisement

Also Read : Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌!

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×