BigTV English

EC React on Pennelli Arrest: పిన్నెల్లి అరెస్ట్‌పై ఈసీ ప్రకటన.. విఘాతం కలిగిస్తే శిక్ష తప్పదు..!

EC React on Pennelli Arrest: పిన్నెల్లి అరెస్ట్‌పై ఈసీ ప్రకటన.. విఘాతం కలిగిస్తే శిక్ష తప్పదు..!

Election Commission React on Pennelli Arrest: ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎం డ్యామేజ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయ్యారు. ఆయన అరెస్ట్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రియాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పిస్తే ఎవరికై శిక్ష తప్పదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి దుశ్చర్యలకు చేయరని వ్యాఖ్యానించింది.


ఏపీ శాసనసభకు మే 13న ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రెంటచింతలలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగి వారం రోజుల తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈవీఎంలు డ్యామేజ్‌కి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ ఎన్నికల సంఘం రియాక్ట్ అయ్యింది.

పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది ఈసీ. అప్పటికే గృహ నిర్భంధంలో ఆయన మాచర్ల నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లారు. అక్కడ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ వ్యవహారం జరుగుతుండగానే పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. పలు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. న్యాయస్థానం విధించిన గడువు ముగియడంతో బుధవారం సాయంత్రం పిన్నెల్లిని నరసారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు.


Also Read: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా.. దాదాపుగా టీడీపీ హైకమాండ్ గ్రీన్‌ సిగ్నల్!

పిన్నెల్లి అరెస్ట్‌పై కేంద్ర ఎన్నికల సంఘం రియాక్ట్ అయ్యిందవి. ఈవీఎం డ్యామేజ్‌కు కారణమైన మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడంతో ఈ ఘటనకు ముగింపు పలికిందని ఈసీఐ పేర్కొంది. హోదాతో సంబంధం లేకుండా చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న విషయాన్ని నిరూపించిందని తెలియజేసింది. ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠినచర్యలు తప్పవని, అందుకు అనుగుణంగా అరెస్ట్ జరిగినట్టు వెల్లడించింది.

కాగా.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను నిన్న రాత్రి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరు పరిచారు. ఈవీఎం ధ్వంసం సహా.. ఓటర్లను భయపెట్టిన 4 కేసుల గురించి విచారణ చేసిన జడ్జి.. పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్ విధించారు. అతన్ని నెల్లూరు జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. కోర్టు లోపలికి తీసుకెళ్తుండగా పిన్నెల్లికి కరచాలనం చేయాలని ప్రయత్నించిన తెలుగు యువత కార్యదర్శి కొమెర శివపై ఆయన చేయిచేసుకున్నారు. శివ కడుపులో గుద్దడం వివాదాస్పదమైంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×