Big Stories

EC Focus on Top Officers: ఏపీపై కన్నేసిన ఈసీ… నెక్ట్స్ జాబితాలో వీళ్లిద్దరేనా..?

Election Commission news latest

- Advertisement -

EC Focus on Top Officers: తెలుగు రాష్ట్రాల్లో అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా అధికార పార్టీకి కొందరు నేతలు వంతపాడుతున్నారు. పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి మాజీలు రావడం గమనించింది ఈసీ. ముఖ్యంగా ఏపీలో అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నేతలు ఎలాగ చెబితే అధికారులు ఆ విధంగా నడుచుకోవడం గడిచిన ఐదేళ్లలో కనిపించింది. దీన్ని గమనించిన ఎన్నికల అధికారులు ముగ్గురు కలెక్టర్లు, ఐదుగురు ఎస్పీలు, ఐజీ స్థాయి అధికారిపై వేటు వేసింది. కొందర్ని వేరే చోటికి బదిలీ చేసింది. మరికొందరికి పోస్టింగ్ ఇవ్వకుండా దూరంగా పెట్టింది.

- Advertisement -

తాజాగా అందుకున్న సమాచారం మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వద్దనున్న జాబితాలో ఇంకా చాలా మంది అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీలకులు వచ్చిన కొద్దిగంటల్లోనే అధికారులపై వేటు పడింది. ఎవరైనా తోక జాడిస్తే ఇదే పరిస్థితి ఎదురవుతుందని అధికారులకు ఓ రకమైన హెచ్చరిక ఇచ్చింది ఎన్నికల సంఘం. ఈ జాబితా పోలీసు బాస్, సీఎస్ ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి.

రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు ఛేంజ్ డాట్ ఓఆర్ జీ వెబ్ సైట్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఫిర్యాదు చేసిన కొద్దిగంటల్లోనే దాదాపు 2500 మంది ఆన్ లైన్ లో మద్దతు పలికారు. ఈ సంఖ్య క్రమంగా పెరిగే అవకాశముందని అంటున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే ఇద్దరు అధికారులను దూరంగా పెట్టాలని అందులో ప్రస్తావించారు. వెంటనే వారిని తొలగించాలని పేర్కొన్నారు.

Also Read: పెండింగ్ సీట్లకు ఖరారు.. అభ్యర్థులపై ప్రకటన..!

ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏపీలో అధికారుల తీరును ఓ కంట కనిపెడుతోంది ఎన్నికల సంఘం. రాష్ట్రానికి పరిశీలకులు రావడంతో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు సీఎస్, డీజీపీలను బదిలీ చేయవచ్చని టాక్ పొలిటికల్ సర్కిల్స్ బలంగా వినిపిస్తోంది. అధికారులిద్దరూ ఆయా పదవుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ల ట్రాక్ రికార్డును కూడా గమనిస్తోందట.

ఈ సందర్భంగా అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ విషయాన్ని కూడా కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. సవాంగ్ డీజీపీగా ఉన్న సమయంలో జగన్ సర్కార్ కు తొత్తుగా వ్యవహరించారన్నది జగమెరిగిన సత్యం. డీజీపీ స్థాయి అధికారి పదవీ విరమణకు సమయం ఉన్నా ఆయన చేత రాజీనామా చేయించి ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి కేంద్రం నుంచి ఎన్నికల పరిశీలకులు రాష్ట్రానికి  రావడంతో ఎన్నికల సంఘం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తికర చర్చ సాగుతోంది. అటు ప్రభుత్వానికి వత్తాసు పలికే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News