E-Paper
Advertisement

మెగాఫోన్ పట్టనున్న రణబీర్ కపూర్!

మెగాఫోన్ పట్టనున్న రణబీర్ కపూర్!
Advertisement

Ranbir Kapoor: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రణబీర్ కపూర్ (Ranbir Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ నటుడిగా, నిర్మాతగా బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోలలో ఒకరిగా మంచి పేరు దక్కించుకున్న ఈయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అలాంటి రణబీర్ కపూర్ తాజాగా రామాయణ: పార్ట్ 1 సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతూ కెరియర్ పీక్స్ లో దూసుకుపోతున్న ఈయన సడన్గా బాంబు పేల్చి అందరిని ఆశ్చర్యపరిచారు. త్వరలోనే నటనకు గుడ్ బై చెప్పేస్తానంటూ చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మరో పదేళ్లు మాత్రమే తెరపై కనిపిస్తాను – రణబీర్ కపూర్

నితీష్ తివారీ భారీ పౌరాణిక చిత్రం రామాయణ: పార్ట్ 1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఇక పై యాక్టర్ గా స్క్రీన్ పై కనిపించేది ఇంకో పదేళ్లు మాత్రమేనని కుండబద్దలు కొట్టారు. నటనకు పూర్తిగా పులిస్టాప్ పెట్టి మెగా ఫోన్ పట్టుకొని దర్శకత్వానికే పరిమితమవుతున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్ మాట్లాడుతూ..” నటుడిగా నేను స్క్రీన్ పై కొనసాగేది పదేళ్లు మాత్రమే. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దర్శకత్వం వైపే దృష్టి సారిస్తాను. దర్శకుడిగా ఒక కొత్త కథను వెండితెరపై ఆవిష్కరించాలనేదే నా జీవిత లక్ష్యం..

డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టనున్న రణబీర్ కపూర్..

Advertisement

సంవత్సరంలో నేను షూటింగ్ల కోసం పనిచేసేది కేవలం వంద నుంచి 125 రోజులు మాత్రమే. కాబట్టి కథలు రాసుకోవడానికి నాకు కావలసిన అంత సమయం కూడా దొరుకుతుంది. ఇప్పటికే నా మొదటి సినిమా కోసం కథ రాయడం మొదలు పెట్టాను. నా దర్శకత్వంలో నేనే హీరోగా నటించే ఆలోచన అయితే లేదు. పైగా నేను డైరెక్ట్ చేసే సినిమాలు నన్ను నేను హీరోగా పెట్టుకునే ఉద్దేశం కూడా లేదు. కొత్త నటులతో ఆ సినిమాలు తీస్తాను” అంటూ ఆయన స్పష్టం చేశారు.

also read: దీపావళి స్పెషల్.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఊహించని సర్ప్రైజ్!

మూడేళ్లలో నా డ్రీమ్ ప్రాజెక్ట్ మీ ముందుకు – రణబీర్ కపూర్

Advertisement

ఇకపోతే దర్శకుడిగా తన తొలి అడుగు గురించి ఆయన మాట్లాడుతూ.. మరో రెండు మూడు సంవత్సరాల లోనే దర్శకుడిగా నేను తొలి అడుగు వేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాను . అయితే నా తొలి చిత్రం ఏ జానర్ లో ఉంటుంది అనే విషయంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేను. కచ్చితంగా క్లాసిక్ చిత్రాలతోనే మీ ముందుకు వస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు . ఇకపోతే డైరెక్ట్ గా మారడానికి ముందు ఆయన కమిట్ అయిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ బ్రహ్మస్త్ర 2, యానిమల్ 2, రామాయణ పార్ట్ 2 షూటింగ్లను పూర్తి చేసిన వెంటనే మూడేళ్ల వ్యవధిలోనే తన తొలి డ్రీమ్ ప్రాజెక్టును తెరపైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే నటనకు గుడ్ బై చెప్పేసి దర్శకుడిగా మారుతానని క్లారిటీ ఇచ్చారు రణబీర్ కపూర్.

Related News

‘రామాయణ’ 3 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

‘ఆదర్శకుటుంబం’ కు దీపావళి కలిసివస్తుందా..?

‘స్పిరిట్ ‘ కోసం వంగీ మామా మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

మృణాల్ ఠాకూర్ ఒక్క నెలకు ఎంత సంపాదిస్తుంది..?

సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేడుకలు షురూ… ఘనంగా పసుపు వేడుక!

తెరపైకి షకీలా బయోపిక్.. సాయి రాజేష్ సంచలన నిర్ణయం!

స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?

Big Stories

Advertisement
×