BigTV English

Bird Flu In Eluru: ఏలూరులో వ్యక్తికి బర్డ్ ఫ్లూ.. కలెక్టర్ ఏం చెప్పారంటే?

Bird Flu In Eluru: ఏలూరులో వ్యక్తికి బర్డ్ ఫ్లూ.. కలెక్టర్ ఏం చెప్పారంటే?

Bird Flu In Eluru: అసలే బర్డ్ ఫ్లూ తో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఇంతలోనే మనిషికి కూడ ఈ వ్యాధి సోకుతుందని ప్రచారం సాగుతోంది, అంతలోనే ఏపీలోని ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇంకేముంది.. కోళ్లు లక్షల సంఖ్యలో చనిపోతున్న వ్యాధి, మానవులకు పాకిందా అనే ప్రశ్నలు అందరి మదిలో మెదిలాయి. ఒక్కసారిగా బర్డ్ ఫ్లూ మనిషికి సోకిందన్న వదంతులు రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. ఈ విషయంపై ఏలూరు జిల్లా కె.వెట్రిసెల్వి ఓ క్లారిటీ ఇస్తూ ప్రకటన జారీ చేశారు.


ఏపీలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో కోళ్లు చనిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. కోళ్లఫారాల యజమానులు కుయ్యో మొర్రో అంటూ ఆదుకోవాలని కోరుతున్నారు. ఇలా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే చికెన్ ధర కూడ నేలకు తాకింది. ఎక్కడ చూసినా చికెన్ షాపులు బోసి పోతున్నాయి. కొనుగోళ్లు లేవని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాలలో చికెన్ కు కొద్ది రోజులు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీనితో ప్రజలు కూడ అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇలాంటి సమయంలోనే మానవులకు కూడ బర్డ్ ఫ్లూ వైరస్ సోకే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారానికి తగ్గట్లుగా ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి వైరస్ సోకిందని వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ విషయం క్షణాల్లో పాకింది. ఏపీ ప్రజలు ఆందోళనకు గురైన పరిస్థితి. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకితే కలిగే ఇబ్బందులు ఎలాంటివంటూ వైద్యులను కూడ ప్రజలు సంప్రదించారు. అసలు ఏలూరులో బర్డ్ ఫ్లూ వ్యక్తికి సోకిందా లేదా అనే విషయం పక్కన పెట్టి, ప్రజలు భయాందోళన చెందారు. ఈ వదంతులపై ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పందించారు.


ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి లో ఒక పౌల్ట్రీ ఫామ్ లో సుమారు లక్ష కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే అకస్మాత్తుగా ఇంత భారీ స్థాయిలో కోళ్లు మృత్యువాత పడటంతో అప్రమత్తమైన అధికారులు మృతి చెందిన కోళ్ల నమూనాలను ల్యాబ్ పరీక్షలు నిమిత్తం తరలించారు. అయితే వాటిల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడైనా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతూ ఉంటే వెంటనే పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియ చేయాలంటూ టోల్ ఫ్రీ నెంబర్ ని ఏర్పాటు చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేశారు. 20 రాపిడ్ రెస్పాన్స్ టీం లను ఏర్పాటు చేశారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 9966779943 ను ఏర్పాటు చేశారు.

Also Read: కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే.. ఏం చేయాలి ?

ఏదైతే బాదంపూడి లోని పౌల్ట్రీ ఫారంలో బర్డ్స్ లో నిర్ధారణ అయిందో అక్కడి నుంచి పది కిలోమీటర్ల పరిధిలోని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా బర్డ్స్ ఫ్లూ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజలకు వివరించేలాగా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఏలూరు జిల్లాలో వ్యక్తికి బర్డ్ ఫ్లూ నిర్దారణ అయింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని , సరైన నిర్దారణ లేకుండా ఎవరైనా అసత్య ప్రచారాలతో ప్రజల్లో అలజడి సృష్టించవద్దని హితవు పలికారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×