Actor Chinna :సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడో ఎన్టీఆర్ (Sr.NTR), ఏఎన్ఆర్ (ANR) కాలం నుండే రాజకీయ రంగం తో సినీ పరిశ్రమకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. సెలబ్రిటీల వారసులు రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకుంటుంటే, రాజకీయ రంగానికి సంబంధించిన నాయకుల వారసులు కూడా ఇటు సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే దివంగత మాజీ సీఎం మేనల్లుడు గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు మరి ఆ మాజీ సీఎం ఎవరు? ఆయన మేనల్లుడు ఎవరు? ఏ సినిమా చేశారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మా మేనమామ- చిన్నా
ఆయన ఎవరో కాదు గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించిన నటుడు చిన్నా (Actor Chinna). ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మేనల్లుడు. ఆయన ఎవరో కాదు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి (Nedurumalli Janardhan Reddy). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సొంత చెల్లెలి కొడుకే ఈ చిన్నా.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్నా మాట్లాడుతూ.. ” మా మేనమామ జనార్దన్ రెడ్డికి నేనంటే చాలా ఇష్టం. నేను యాక్టర్ అయ్యాక ఆయన ఎంతో సంతోషపడ్డారు. అయితే ఒకసారి ఆయన సీఎం అయిన తర్వాత క్యాబినెట్ అంతా పిలిచి నన్ను చూపించి, ఆయన ఎవరో తెలుసా అని అంటే.. అందరూ యాక్టర్ చిన్నా అని అన్నారు. కాదు నా మేనల్లుడు అని మా మామయ్య చాలా గర్వంగా చెప్పుకున్నారు. ఆరోజు జరిగిన ఘటన, మా మామయ్య ముఖంలో ఆ గర్వం నేను ఎప్పటికీ మరిచిపోలేను. అయితే మా మామయ్య పేరును నేను ఏ రోజు కూడా వాడదలుచుకోలేదు. అందుకే నా ఫోటోలు పట్టుకొని అవకాశాల కోసం తిరిగాను. యాక్టింగ్ ట్రైనింగ్ అయ్యాక ఒకసారి దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) కి మా మామయ్య ఫోన్ చేసి నా మేనల్లుడు కొంచెం చూసుకో అన్నారు. కానీ.. సినిమా ఇండస్ట్రీలో రికమండేషన్ కుదరవు కదా.. ఇక మా మామయ్య సీఎం అయిన తర్వాత కూడా నేను ఆయన పరపతిని ఉపయోగించకుండా కష్టపడి సినిమాల్లో నటించే ఈ స్థాయికి వచ్చాను” అంటూ ఆయన తెలిపారు. మొత్తానికి అయితే చిన్నా పడిన కష్టానికి అభినందించాల్సిందే అని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజకీయ జీవితం..
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విషయానికి వస్తే.. కాంగ్రెస్ లో యువనేత నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రిగా కొనసాగిన ఈయన ఆ తర్వాత ఎదుగుతూ ముఖ్యమంత్రి అయ్యారు. 1990 డిసెంబర్ నుండి 1992 అక్టోబర్ వరకు రెండేళ్లు ఆయన ఏపీకి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత ఎంపీగా బాధ్యతలు చేపట్టారు.చిన్న సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు హీరోగా నటించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. ఇప్పటికీ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.