Amaravati: ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజల మద్దతు కూటమికే ఉదన్నారు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు. ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి వైపు ఉన్నారని, అదే స్ఫూర్తి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కొనసాగించాలన్నారు. పంచాయతీల్లో గెలిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ కాస్త ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అవుతుందన్నారు.
పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం మీడియా ముందుకొచ్చారు కూటమి నేతలు. అమరావతిలోని టీడీపీ ఆఫీసులో ఏర్పాటు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు, జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాట్లాడారు.
కూటమి ఐక్యతే లక్ష్యమని, జన సైనికులదీ అదే బాటని అన్నారు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్. కూటమిలో ఏ పార్టీ పోటీ చేసినా జన సైనికులు మద్దతుగా నిలిచారన్నారు. జనసేనాని మార్గంలో కూటమి ఐక్యతను కొనసాగిస్తూ పంచాయతీ ఎన్నికల్లోనూ కలిసి ముందుకు సాగుతామన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయితీ ఎన్నికల్లో యువ నాయకత్వానికి ఎక్కువ అవకాశం ఇచ్చిందన్నారు. సంక్షేమం తోపాటు అభివృద్ధి పనులపై పెట్టిన నమ్మకం ప్రజలను ఆకట్టుకుందన్నారు.
రెబల్స్ లేకుండా మూడు పార్టీలు ఒకే నిర్ణయంతో ఎన్నికలకు వెళ్లాలన్నదే మా ఆలోచనగా చెప్పారు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు సామర్థ్యం, సమర్థతకే ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రం నుంచి మండల స్థాయి వరకు కూటమి పార్టీల మధ్య సమన్వయం కొనసాగుతోందన్నారు. 100 శాతం స్ట్రైక్ రేటుతో గెలవాలన్నది తమ ఆలోచనగా చెప్పారు.
ALSO READ: రూటు మార్చిన వైసీపీ.. బీజేపీని టార్గెట్ చేస్తూ, మంత్రి సత్యకుమార్‌పై పేర్ని నాని విసుర్లు
మొదటిసారి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారన్న కూటమి నేతలు, ప్రజల భవిష్యత్ కోసమే ఈ కూటమి ప్రభుత్వమన్నారు. అంతిమంగా యువ నాయకత్వం రావాలన్నారు. పులివెందులలో స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం వచ్చిందని స్థానికులు అంటున్నారని వివరించారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. జరిగిన ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించామన్నారు. ఎన్నికల ప్రారంభం తర్వాత మధ్యలో తుఫాన్ వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయకత్వంలో ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని గ్రామాలకు నేరుగా నిధులు వెళ్లేలా చూస్తామన్నారు.