E-Paper
Advertisement

పండుగ ఆఫర్లు లేవు.. హంగూ ఆర్భాటం ఉండదు.. అయినా సామాన్యుల అడ్డాగా డీమార్ట్ ఎలా మారింది?

పండుగ ఆఫర్లు లేవు.. హంగూ ఆర్భాటం ఉండదు.. అయినా సామాన్యుల అడ్డాగా డీమార్ట్ ఎలా మారింది?
Advertisement

DMart Success Story: దేశ రిటైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని డీమార్ట్ (Dmart) సాధించింది. 2002లో ముంబయిలోని పవాయ్‌లో ఒక చిన్న స్టోర్‌తో మొదలైన డీమార్ట్ ప్రయాణం.. నేడు దేశవ్యాప్తంగా 500కు పైగా స్టోర్లతో కోట్లాది మంది భారతీయులకు నిత్యవసరాలు అందించే ప్రధాన వేదికగా మారిపోయింది. అయితే ఇదంతా ఇందత ఒక్కరాత్రిలో వచ్చిన సక్సెస్ కాదు. దీని వెనుక ఎంతో శ్రమ, కృషి, కస్టమర్ల అవసరాలు గుర్తెరిగి నడుచుకోవడం వంటి ఎన్నో అంశాలు డీమార్ట్ ను విజయవంతంగా మార్చాయి.

డీమార్ట్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే?

ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ (Radhakishan Damani) డీమార్ట్ వ్యవస్థాపకులు. 1999లో నెరుల్‌లో ‘అప్నా బజార్’ (Apna Bazaar) ఫ్రాంచైజీని నడిపిన అనుభవంతో రిటైల్ రంగంలోని లోటుపాట్లను ఆయన గమనించారు. సొంతంగా మెరుగైన వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనతో 2000 సంవత్సరంలో ‘అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్’ (Avenue Supermarts Ltd)ను స్థాపించి.. 2002లో తొలి డీమార్ట్ స్టోర్‌ను ప్రారంభించారు. ఇతర రిటైల్ సంస్థల్లా అద్దె భవనాలపై ఆధారపడకుండా సొంత స్థలాల్లోనే స్టోర్లను నిర్మించడం డీమార్ట్ ప్రత్యేకత. దీనివల్ల భవిష్యత్తులో అద్దె భారం తగ్గడమే కాకుండా సంస్థ ఆస్తుల విలువ కూడా పెరిగింది.

డీమార్ట్ సక్సెస్‌కు కారణాలు

Advertisement

డీమార్ట్ విజయంలో ‘ప్రతిరోజూ తక్కువ ధరలు’ (Everyday Low Price strategy) అనే వ్యూహం కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక ఆఫర్లు, పండుగ సేల్స్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఎప్పుడూ తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు లభిస్తాయనే నమ్మకాన్ని కస్టమర్లలో డీమార్ట్ కలిగించింది. నిత్యావసర సరుకులు, కిరాణా సామాగ్రిపై ఎక్కువగా దృష్టి పెట్టడం ద్వారా కస్టమర్లు పదేపదే తమ స్టోర్లకు వచ్చేలా చేసింది. ప్రకటనలు, పబ్లిసిటీ కోసం అనవసర ఖర్చులు చేయకుండా వినియోగదారుల మౌఖిక ప్రచారాన్నే నమ్ముకొని రిటైల్ రంగంలో కొత్త ఒరవడికి డీమార్ట్ కారణమైంది. అంతేకాకుండా సప్లయర్లకు మిగతా సంస్థల కంటే వేగంగా చెల్లింపులు చేయడం వల్ల సరఫరా గొలుసు ఎప్పుడూ బలంగా ఉండేలా చూసుకుంది.

రూ. 68 వేల కోట్ల టర్నోవర్

అప్పులు చేయకుండా వచ్చిన లాభాలనే తిరిగి కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించడం ద్వారా పెట్టుబడి దారుల్లో బలమైన నమ్మకాన్ని డీమార్ట్ సంపాదించింది. 2017లో స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ ఎన్నడూ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని డీమార్ట్ కోల్పోకపోవడం విశేషం. 2026 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సుమారు రూ.67,000 నుండి రూ.68,800 కోట్ల ఆదాయాన్ని, సుమారు రూ.3,000 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి సత్తా చాటింది. మరోవైపు నాయకత్వ మార్పుల విషయంలోనూ రాధాకిషన్ దమానీ ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తుండటం డీమార్ట్ కు కలిసొస్తోంది. నెవిల్ నోరోన్హా తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్షుల్ అసవాను ఎండీ, సీఈఓగా నియమించడం ఇందుకు నిదర్శనం.

12 రాష్ట్రాలు.. 500 పైగా స్టోర్లు

Advertisement

2002లో ముంబైలోని పవాయ్‌లో మొదటి డీమార్ట్ స్టోర్ ప్రారంభం కాగా.. 2010 నాటికి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో సుమారు 25 నుండి 29 స్టోర్లకు విస్తరించింది. అక్కడి నుండి వేగం పుంజుకుని 2013 నాటికి 65 స్టోర్ల మైలురాయిని దాటడమే కాకుండా ఆదాయ పరంగా దేశంలోనే మూడవ అతిపెద్ద రిటైల్ చెయిన్‌గా అవతరించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా 2016లో ‘డీమార్ట్ రెడీ’ పేరుతో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 2017లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టగా ఇన్వెస్టర్ల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ స్థిరమైన ప్రయాణంలో 2022 నాటికి దేశవ్యాప్తంగా 300 స్టోర్లను దాటిన డీమార్ట్.. 2026 నాటికి 12కు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 500కు పైగా స్టోర్ల భారీ మైలురాయిని చేరుకుంది.

Also Read: ఈ రైతు ‘లాటరీ’ పండిందోచ్.. రూ.500 టికెట్‌పై ఏకంగా రూ.12 కోట్ల జాక్ పాట్.. 15 ఏళ్ల నిరీక్షణకు తెర!

నేటి తరానికి గొప్ప పాఠం

వేగంగా విస్తరించడం కంటే స్థిరంగా, లాభదాయకంగా ఎదగడం ముఖ్యమని డీమార్ట్ నిరూపించింది. ప్రస్తుతం క్విక్-కామర్స్ సంస్థల నుండి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ ‘డీమార్ట్ రెడీ’ ద్వారా ఆన్‌లైన్ డెలివరీ సేవలను విస్తరిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా డీమార్ట్ అడుగులు వేస్తోంది. క్రమశిక్షణ, కస్టమర్ల నమ్మకం ఉంటే ఎంతటి పోటీనైనా తట్టుకుని నిలబడవచ్చని నేటి తరం పారిశ్రామికవేత్తలకు డీమార్ట్ ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది.

Also Read: మసీదులో నక్కినా తప్పని చావు.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ ఖతం.. ఇది కదా రివేంజ్ అంటే!

Tags

Related News

UPI ఛార్జీల ఇష్యూ.. కేంద్రానికి పేమెంట్ సంస్థల విన్నపాలు, అమలు చేయాలంటూ

ఏఐతో 2028 కల్లా ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ముప్పు.. హెచ్చరించిన అమెరికా నిపుణులు

భారీగా బంగారం, వెండి ధరలు పతనం.. మార్కెట్లో రేటు ఎలా ఉంది? ఇంకా పతనం అయ్యే ఛాన్స్

రూ.10 కూల్‌డ్రింక్‌తో రూ.800 కోట్ల వ్యాపారం.. పాకిస్తాన్ పేరుబెట్టి ఇండియాలో సంచలనం

ఎన్విడియాలో ట్రంప్ పెట్టుబడులు.. వెలుగులోకి తెచ్చిన అమెరికా మీడియా, ఆ పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి

అతి పెద్ద సైబర్ దాడి.. ప్రపంచవ్యాప్తంగా 178 వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా

సామాన్యుడి జేబుకు చిల్లు.. కిరాణా సరుకులే కాదు ఈ రోజువారీ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి

Big Stories

Advertisement
×