BigTV English

Ex-Minister Roja: మరో వివాదంలో ఫైర్ బ్రాండ్ రోజా.. సొంత కార్యకర్తలపై చేయి చేసుకుని.. బూతులు తిడుతూ..

Ex-Minister Roja: మరో వివాదంలో ఫైర్ బ్రాండ్ రోజా.. సొంత కార్యకర్తలపై చేయి చేసుకుని.. బూతులు తిడుతూ..

Ex-Minister Roja: ఆర్కే రోజా.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మూవీస్‌లో స్డార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది రోజా. పాలిటిక్స్‌లో రోజా అంటే ఫైర్.. ఫైర్ అంటే రోజా అన్నట్లుగా  గుర్తింపు తెచ్చుకుంది. దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరుగా.. ప్రత్యర్ధులపై ఆమె చేసిన వ్యాఖ్యలు అంత ఘాటుగా ఉండేవి మరి. ఆ నోటి దురుసుతో రోజా బూతు మంత్రుల లిస్ట్‌లో కూడా చేరిపోయారు. ఏ విషయంలోనైనా సరే.. ప్రత్యర్ధులను ఏకిపారేయడం ఆమె స్టైల్.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన హవా నడిపించిన రోజా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తన మార్క్‌ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నారు.  రోజా మరో వివాదంలో చిక్కుకోవడమే ఇందుకు ఉదాహరణ.


ఒకప్పుడు దక్షిణాదిలో అగ్రహీరోలతో నటించి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయిన తన పట్టుదలతో క్రేజీ హీరోయిన్‌గా ఎదిగారు. దర్శకుడు శెల్వమణితో కొన్నేళ్లపాటు ప్రేమాయణం సాగించి, ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇక సినిమాలలో నటిస్తూనే రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి చూపడంతో.. చంద్రబాబు సారథ్యంలో టీడీపీలోకి చేరారు. 2009లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన రోజా.. ఆ తర్వాత కాలంలో టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీలోకి చేరారు. ప్రత్యర్ధులపై వాడీ వేడి విమర్శలు చేసి.. మరింత రాటు దేలారు. 2014లో నగరి నియోజక వర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. నాడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో.. జగన్ ఆదేశాల మేరకు అధికార పక్షంపై పోరాటం చేసారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి నగరి నుంచి పోటీ చేసి గెలిచారు.

వైసీపీ సైతం అధికారంలోకి రావడంతో.. రోజాకు ఏపీఐఐసీ చైర్ పర్శన్‌గా జగన్ నియమించారు. కొద్దికాలంలోనే ఆమెకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఘోర ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి రోజా.. కొన్నాళ్లపాటు మీడియా ముందుకు సైతం రాలేదు.  ఆర్కే రోజా ఆజ్ఞాతంలో ఉండేసరికి రాజకీయాలకు గుడ్ బై చెప్పారని.. మళ్లీ జబర్దస్త్ షోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అంతే కాదు తమిళనాడులో హీరో విజయ్ తన పార్టీలో చేరాలనే ఆఫర్ ఇచ్చారని.. తెలుగు రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ కంప్లీట్ కావడంతో.. రోజా మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు.


ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలుగుప్పిస్తూ.. ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తిరుపతిలో వైకుంఠద్వారా దర్శనం టోకెన్ల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద.. తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై మాజీ మంత్రి రోజా  కూడా స్పందించారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: దొరికిపోయిన అంబటి సోదరులు, ఆపై కేసు.. ఏం జరిగింది?

ఎఫ్‌ఐఆర్‌లో 194 బీఎన్ఎస్ కింద కేసు పెట్టి.. చేతులు దులిపేసుకున్నారని.. కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే మరో వివాదంలో చిక్కుకున్నారు రోజా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి బాధితులను పరామర్శించి వస్తుండగా.. రోజాను వైసీపీ నేతలు, అభిమానులు చుట్టుముట్టారు. దీంతో ఆమెకు అక్కడి నుంచి బయటకు రావడం కష్టమయింది. ఓపిక నశించడంతో కార్యకర్తలపై చేయి చేసుకుని, తిడుతూ.. అడ్డుతప్పుకోవాలంటూ.. మండిపడింది. ఇంతలో పోలీసులు కార్యకర్తలను పక్కకి లాగేసి రోజాను బయటకు తీసుకొచ్చారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×