BigTV English

Psoriasis: సోరియాసిస్ ఎందుకు వస్తుంది ? ఇది అంటు వ్యాధా ?

Psoriasis: సోరియాసిస్ ఎందుకు వస్తుంది ? ఇది అంటు వ్యాధా ?

Psoriasis: ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయి. వీటిలో క్యాన్సర్,టీబీ, డయాబెటిస్, సోరియాసిస్ తీవ్రమైన వ్యాధులు. సోరియాసిస్ అనేది చర్మానికి సంబంధించింది. ఈ వ్యాధి ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ ఇది సాధారణంగా పెద్దలలో ఎక్కువగా కనిపిస్తుంది. మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, డిప్రెషన్ వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులకు సోరియాసిస్ కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.


ఈ వ్యాధికి అసలు కారణం తెలియదు, కానీ రోగనిరోధక శక్తి, జన్యుపరమైన కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అంతే కాకుండా ఇది శరీరంలోని ఏ భాగాన్నయినా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన తర్వాత ఇబ్బందిపడే బదులు ప్రారంభంలోనే దాని లక్షణాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సోరియాసిస్ లక్షణాలు , దీని వల్ల కలిగే ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సోరియాసిస్ లక్షణాలు, కారణాలు:


సోరియాసిస్ యొక్క లక్షణాలు ఏంటి ?
సాధారణంగా ప్రజలు చర్మంపై దురద, దద్దుర్లు లాంటివి వచ్చినప్పుడు లైట్ తీసుకుంటారు. కానీ ఇవి సోరియాసిస్ యొక్క ప్రధాన లక్షణాలు అని గుర్తుంచుకోండి. వీటిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ ఇంట్లో ఎవరైనా సోరియాసిస్‌తో బాధపడుతుంటే మాత్రం మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. చర్మం గరుకుగా, మందంగా ఉన్నట్లు అనిపించినా లేదా చర్మంపై దద్దుర్లు కనిపించినా డాక్టర్‌ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. సోరియాసిస్ ఎక్కువగా మోచేయి, మోకాలి భాగాలలో కనిపిస్తుంది.

సోరియాసిస్ అంటువ్యాధా ?
సోరియాసిస్ అంటు వ్యాధి కాదని నిపుణులు చెబుతున్నారు. సోరియాసిస్ వ్యాధిగ్రసులు స్నానం చేసిన స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేయడం, సోరియాసిస్ వ్యాధిగ్రస్తులతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపించదు. కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.

వ్యాధి ప్రమాదం ఎప్పుడు పెరుగుతుంది ?
వాతావరణం
పొగాకు వాడకం
మద్యం వినియోగం
ఒత్తిడి
శరీరంలోని ఏదైనా భాగానికి గాయం ఉంటే
సంక్రమణ ద్వారా

సోరియాసిస్‌కు చికిత్స ఏమిటి ?
ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేదని, కానీ దాని లక్షణాలను, చర్మంపై దద్దుర్లు తగ్గించే అనేక చికిత్సలు ఉన్నాయని వెల్లడించారు. ఈ వ్యాధి చికిత్స కోసం మీరు వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో వైద్యులను సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Also Read: ఆకర్షణీయమైన ఐబ్రోస్ కోసం.. ఇలా చేయండి

సోరియాసిస్‌కు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?
శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సరైన దినచర్య, ఒత్తిడికి దూరంగా ఉండటం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. సోరియాసిస్ అయినా, మరేదైనా వ్యాధి అయినా సరే, మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ముందుగానే శ్రద్ధ వహిస్తే వ్యాధులు ప్రమాదం పెరగకుండా ఉంటుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×