Ambati Rambabu’s Brothers: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి చెప్పనక్కర్లేదు. సూటిపోటి మాటలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో ఆయన దిట్ట. ఆయన మాటలే కాదు.. చేసే పనులూ అలాగే ఉంటాయి. లేటెస్ట్‌గా అంబటి రాంబాబు, ఆయన సోదరుడు అడ్డంగా బుక్కయ్యారు. ఇంతకీ విషయం ఏంటన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.
వైసీపీలో ఫైర్ బ్రాండ్ అనగానే గుర్తొచ్చే వారిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరు. తన మాటలతో ప్రత్యర్థులపై బాణాలు ఎక్కుపెట్టడంతో ఆయనకు తిరుగులేదని అంటుంటారు. ఒక్కోసారి ఆయా బాణాలు రివర్స్ అయినా ఏ మాత్రం చలించరాయన.
మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన సోదరుడు మురళీకృష్ణపై కేసు నమోదు అయ్యింది. హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు పోలీసులు అంబటి సోదరులపై కేసు నమోదు చేశారు. వైసీపీ రూలింగ్‌లో భజరంగ్ జూట్ మిల్లు స్థలాలు విక్రయం, గ్రీన్ గేస్ అపార్టుమెంట్ అక్రమ నిర్మాణాలు చేశారు. వాటిపై పోరాటం చేస్తున్నారు బాధితులు.
వారికి అండగా నిలిచారు కార్మిక సంఘం నాయకుడు పిల్లి బాబురావు. దీనిపై వైసీపీ ప్రభుత్వంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరకు కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశించారు. ఫలితంగా బాబురావుకు అంబటి సోదరుల నుంచి బెదిరింపులు తీవ్రమయ్యాయి.
ALSO READ: నెరవేరిన బాధితుల కోరిక.. తిరుమలలో స్పెషల్‌గా వైకుంఠ దర్శనం
చివరకు రక్షణ కోసం ఆయన హైకోర్టు మెట్లు ఎక్కారు. జరిగిన విషయాన్ని న్యాయస్థానానికి వివరించారు. అంబటి సోదరులపై చర్యలు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో గుంటూరులోని నగరపాలెం పోలీసులు అంబటి రాంబాబు, ఆయన సోదరుడు మురళిపై కేసు నమోదు చేశారు. దీంతో అంబటి వ్యవహారాలపై పోలీసులు ఫోకస్ చేశారు.