రాజమౌళి (Rajamouli )దర్శకత్వంలోనే నటించే హీరోలు.. పాన్ ఇండియా స్టార్లు అవుతారని చాలామంది హీరోలకు ఒక సెంటిమెంట్ అయితే ఉంది. కానీ అల్లు అర్జున్ (Allu Arjun), యష్ (Yash)ఇద్దరు హీరోలు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి, తమ సినిమాలతో పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. అల్లు అర్జున్, సుకుమార్(Sukumar) కాంబో లో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయితే, యష్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇక ఈ ఇద్దరు హీరోలలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే.. వీరిద్దరినీ పాన్ ఇండియా హీరోలను చేసిన సినిమాలు మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ అతిపెద్ద హిట్ కొట్టాయి. అలా అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప -2,యష్ కెరియర్ లో కేజీఎఫ్ -2 అతిపెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు.
పుష్ప 2 సరికొత్త రికార్డ్స్..
అయితే నిన్న మొన్నటి వరకు దేశం మొత్తం పుష్ప రాజ్ హవానే నడిచింది. అంతేకాదు పుష్ప -2 కలెక్షన్స్ తో దంగల్ సినిమాకి దగ్గరలో చేరింది. రూ.2000 కోట్లు సాధించి దంగల్ మూవీ ఇండియాలోనే హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఉంటే, మొన్నటి వరకు రూ.1810 కోట్లతో రెండో ప్లేస్ లో ఉన్న బాహుబలి 2 మూవీ ని అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ వెనక్కి నెట్టేసింది. రూ.1831 కోట్లకు పైగా పుష్ప-2 మూవీ కలెక్ట్ చేయడంతో రెండో ప్లేస్ లో నిలిచింది. అలాగే ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగి దంగల్ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేయాలని పుష్పరాజ్ అభిమానులు ఎంతో మంది కోరుకున్నారు.
పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన యష్ టాక్సిక్..
ఈ విషయం కాస్త పక్కన పెడితే.. ఇప్పటివరకు హిందీలో ఒక రికార్డు ఉంది. అదేంటంటే పుష్ప-2 సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్ గ్లింప్స్ 24 గంటల్లోనే 27.67 మిలియన్ వ్యూస్ ని సాధించి టాప్ ప్లేస్ లో నిలిచింది. అయితే తాజాగా పుష్ప-2 రికార్డును సైతం బద్దలు కొట్టింది యష్ టాక్సిక్ మూవీ.తాజాగా యష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్ కి సంబంధించి గ్లింప్స్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ టాక్సిక్ మూవీ గ్లింప్స్ యష్ బర్త్ డే రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ లో అమ్మాయిలతో పబ్ లో ఉంటారు యష్.అలాగే ఈ సినిమాలో కూడా కేజిఎఫ్ సినిమాలో లాగే గ్యాంగ్ స్టర్ గా నటించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన హిందీ వెర్షన్ గ్లింప్స్ విడుదల చేయగా కేవలం 13 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ ని దాటేసింది. దీంతో అప్పటివరకు ఉన్న పుష్ప-2 గ్లింప్స్ రికార్డు బద్దలై యష్ టాక్సిక్ మూవీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో టాక్సిక్ మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక ప్రస్తుతం యష్, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సీక్ మూవీ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో రామాయణం మూవీలో రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి గానూ యష్ దాదాపు రూ.200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు కూడా చాలా రోజుల నుండి బీ టౌన్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఏది ఏమైనప్పటికీ టాక్సిక్ మూవీ గ్లింప్స్ తోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నింపేసారు యష్.మరి ఈ సినిమా విడుదలయ్యే లోపు ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.