BigTV English

Budget 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గా 50 శాతం సాలరీ.. బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశం

Budget 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గా 50 శాతం సాలరీ.. బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశం

Budget 2024: మరో మూడు రోజుల్లో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం సమర్పించే బడ్జెట్ 2024-25 లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆర్థిక శాఖ ఓ కీలక సంస్కర్ణ తీసుకురాబోతుందని సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. నేషనల్ పెన్షన్ స్కీమ్ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత వారి చివరి నెల జీతంలో 50 శాతం పెన్షన్‌గా ఇచ్చే అవకాశం ఉంది.


ఈ కీలక సంస్కరణ ద్వారా చాలా కాలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో 25 నుంచి 30 ఏళ్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు, ముఖ్యంగా 2004 తరువాత ఉద్యోగంలో చేరిన వారికి ఈ 50 శాతం పెన్షన్ లభిస్తుందని తెలిసింది.

ఆర్థిక శాఖ ఫైనాన్స్ సెక్రటరీ టీవి సోమనాథన్ అధ్యక్షతన ఉన్న కమిటీ.. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌గా 50 శాతం నెలజీతం విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదన చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏర్పాటు చేసిన ఈ కమిటీ.. ప్రపంచ దేశాల ప్రభుత్వాల విధానాలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన సంస్కర్ణలను అధ్యయనం చేసిన తరువాత కొత్త పెన్షన్ విధానాన్ని ప్రతిపాదించింది. 50 శాతం నెల జీతం పెన్షన్ విధానం వల్ల ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో సానుకూలత పెరుగుతుందని కమిటీ పేర్కొంది.


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి రిటైర్మెంట్ ఫండ్ లేకుండా మాజీ ఉద్యోగులకు పెన్షన్ చెల్లిస్తోంది. ఇప్పుడు సోమనాథన కమిటీ చేసిన సిఫారసు వల్ల ఒక కొత్త పెన్షన్ సిస్టమ్ కార్యరూపం దాలుస్తుంది. బడ్జెట్ 2024-25 లో ఈ ప్రతిపాదన ముఖ్యాంశంగా మారునుంది.

Also Read: కొత్త బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్‌లో ఏది ఉచితం?

నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
నేషనల్ పెన్షన్ సిస్టమ్.. ఉద్యోగులు వాలంటరీగా చేసుకునే సేవింగ్స్‌ని రిటైర్మెంట్ తరువాత వారికి ఆర్థిక భద్రతగా ఉపయోగపడుతుంది. ఈ సిస్టమ్‌ని పెన్షన్ ఫండ్ రెగులేటరీ అండ్ డెవలప్మెంంట్ అథారటీ నియంత్రిస్తుంది. ఉద్యోగులు తమ నెల జీతంలో నుంచి చేసుకున్న సేవింగ్స్ మొత్తాన్ని ప్రభుత్వం షేర్ మార్కెట్ లో, కార్పొరేట్ బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్స్, ప్రత్యామ్న ఆస్తులలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్ ను నియంత్రంచేందుకు పెన్షన్ ఫండ్ మేనేజర్స్‌ను ప్రభుత్వం నియమిస్తుంది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో తమ సేవింగ్స్ ను పెట్టుబడిగా పెట్టిన వారికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c, 80CCD(1B) కింద మినహాయింపు లభిస్తుంది.

 

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×