Gorantla Madhav On Modi Govt: ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మలచు కోవడంతో వైసీపీకి తిరుగులేదు. ఈ విషయాన్ని కొందరు రాజకీయ నాయకులు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. లేనప్పుడు సైతం అదే ఒరవడి కంటిన్యూ చేస్తున్నారు. లేటెస్ట్‌గా విశాఖ ఉక్కుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.
ఏపీలో విశాఖ ఉక్కు రాజకీయం మొదలైనట్టు కనిపిస్తోంది. కేంద్రం ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీతో ఫ్యాక్టరీ కార్మికులు, కూటమి నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది వైసీపీ. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు మాట్లాడే సాహసం చేయలేదు. చివరకు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నోరు విప్పారు. ఈ క్రమంలో మోదీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరంపై అప్పటి జగన్ ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. కానీ జగన్ వీటికీ తలొగ్గలేదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకూడదని ఆనాడు కేంద్రాన్ని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖ ఉక్కుకు గుండె పోటు వస్తే.. కాలికి కట్టు కడదాం అనేలా అప్పుడు కేంద్రం వ్యవహరించిందన్నారు.
35 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని మనకు తెలుసన్నారు మాజీ ఎంపీ. ఐసీయూలో ఉన్న పేషెంట్ కు కొద్ది ఆక్సిజన్ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలంటూ కొత్త పల్లవిని తెరపైకి తెచ్చారు. ఇదే అంశంపై గత రాత్రి వైసీపీకి చెందిన ఛానెల్‌లో చర్చ జరిగింది. అందులో నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలన్నారు.
ALSO READ: జగన్ ఇలాకాలో.. సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు అప్పటి సీఎం జగన్. ఈ ఫ్యాక్టరీపై ఎలాంటి హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి లేవన్నారు. దీనిపై సర్వాధికారాలు కేంద్రానికే ఉన్నాయన్నారు. ప్రైవేటీకరించకుండా మోదీ సర్కార్‌పై ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో అప్పటి ప్రతిపక్షం టీడీపీ.. కేంద్రాన్ని నిలదీయాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిన విషయం తెల్సిందే.