E-Paper
Advertisement

సీబీఐ అధికారుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. ఐదుగురి అరెస్టు

సీబీఐ అధికారుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. ఐదుగురి అరెస్టు
Advertisement

Fake CBI Officers: సీబీఐ అధికారులమని చెప్పి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాధితుడిని సురక్షితంగా విడిపించడంతో పాటు నిందితుల నుంచి నకిలీ తుపాకీ, సీబీఐ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మోహన్ కుమార్ వెల్లడించారు.

కోర్టులో పరిచయం.. కిడ్నాప్‌కు స్కెచ్

Advertisement

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని అగడ్తా వీధికి చెందిన సాధిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కర్ణాటకలోని ఓ కేసు విచారణ నిమిత్తం అక్కడి కోర్టుకు తరచూ వెళ్లే క్రమంలో సాధిక్‌కు చిత్తూరుకు చెందిన రాజ శ్రీనివాసులు తో పరిచయమైంది. సాధిక్ వద్ద భారీగా డబ్బు ఉందని గ్రహించిన శ్రీనివాసన్, అతడిని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని పథకం వేశాడు. ఇందుకోసం తిరుపతికి చెందిన వెంకటరమణ సాయం తీసుకున్నాడు. వెంకటరమణ కర్ణాటకకు చెందిన కొందరితో కలిసి కిడ్నాప్‌కు ముఠాను సిద్ధం చేశాడు.

సీబీఐ పేరుతో బెదిరింపులు.. రూ.5 కోట్ల డిమాండ్

Advertisement

ఈ నెల 11న మదనపల్లెకు వచ్చిన దుండగులు, స్థానిక శ్మశాన వాటిక వైపు వెళ్తున్న సాధిక్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని కర్ణాటకకు తీసుకెళ్లారు. తాము సీబీఐ అధికారులమని నమ్మబలుకుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రూ.26 లక్షలు కాజేసి.. పోలీసులకు చిక్కారిలా

విషయం తెలుసుకున్న సాధిక్ కుటుంబ సభ్యులు వెంటనే ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్సై రహీముల్లా, మదనపల్లె రూరల్ ఎస్సై రామకృష్ణ రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఈలోగా కిడ్నాపర్లు సాధిక్ బంధువులు, స్నేహితుల నుంచి తమ ఖాతాల్లోకి రూ.26 లక్షలు బదిలీ చేయించుకున్నారు. మిగిలిన డబ్బు కోసం శనివారం రాత్రి కర్ణాటక నుంచి కారులో వస్తుండగా మదనపల్లె సమీపంలో పోలీసులు మాటువేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సాధిక్‌ను క్షేమంగా కాపాడి, నిందితుల వద్ద ఉన్న కారు, నకిలీ తుపాకీ, ఫేక్ సీబీఐ ఐడీ కార్డులు, నకిలీ అరెస్టు వారెంట్ పత్రాలను సీజ్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు వెంకటరమణను త్వరలోనే పట్టుకుంటామని సీఐ స్పష్టం చేశారు.

Also Read: రాజస్థాన్ రైల్వే ట్రాక్ పేలుడు వెనుక పాక్ గూఢచార సంస్థ.. డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా

Tags

Related News

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ఐదేళ్ల స్నేహితుడిని నరికి చంపిన నిందితుడు!

సీఎం చంద్రబాబుతో జనసేన నేతలు భేటీ.. ZP ఛైర్మన్ పదవులపై అదే ఉత్కంఠ, సాయంత్రం నాటికి

ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ఐదుగురు మృతి, వికారాబాద్-తిరుపతి ఏరియాల్లో

కార్తీకమాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్ ధరలు, భగ్గుమన్న కూరగాయల ధరలు

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

లైటుగా తీసుకోవద్దు.. నేతలను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు

రాప్తాడు ఘటన బాధితురాలి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్.. ఇప్పుడెలా ఉందంటే?

Big Stories

Advertisement
×