E-Paper
Advertisement

ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ఐదుగురు మృతి, వికారాబాద్-తిరుపతి ఏరియాల్లో

ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ఐదుగురు మృతి, వికారాబాద్-తిరుపతి ఏరియాల్లో
Advertisement

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండు ఘటనల్లో దాదాపు ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అందులో ఒకటి వికారాబాద్ జిల్లా కాగా, మరొకటి తిరుపతి జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. క్షతగ్రాతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు

వికారాబాద్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొంరాస్ పేట్ మండలం నాందార్‌పూర్ శివారులో కారు ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తుంకిమెట్ల నుంచి కోస్గి వైపు కారు వెళ్తోంది. కారు ఆటో ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

మృతుల్లో ఒకరు రెండురోజుల్లో వివాహం జరగాల్సివుంది. అంతలోనే ఈ ఘటన జరిగింది. ప్రమాదం గురించి సమచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

వికారాబాద్-తిరుపతి జిల్లాలో ఐదుగురు మృతి

తిరుపతి జిల్లాలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలో టిప్పర్ లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది సుమో వాహనం. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందినవారు.

Advertisement

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు చంద్రగిరి పోలీసులు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, వాహనాలను పక్కకు తొలగించారు. జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్ క్లియర్ చేశారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

ALSO READ: కార్తీకమాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్ ధరలు, భగ్గుమన్న కూరగాయల ధరలు

Related News

కార్తీకమాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్ ధరలు, భగ్గుమన్న కూరగాయల ధరలు

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

లైటుగా తీసుకోవద్దు.. నేతలను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు

రాప్తాడు ఘటన బాధితురాలి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్.. ఇప్పుడెలా ఉందంటే?

ఏపీలో 45 ఏళ్లుగా ఒకే కుటుంబం గుప్పిట్లో గ్రామ రాజకీయం.. ఎక్కడో తెలుసా..?

తిరుపతి శ్రీసిటీలో మరో భారీ అంతర్జాతీయ ప్రాజెక్టు ఆర్డర్?

వరాహ నదిలో విషాదం.. స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతు!

Big Stories

Advertisement
×