Srikakulam Murder: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అప్పాపురం గ్రామానికి చెందిన అసిరి నాయుడు (26) ఈ నెల 3న కనిపెంచకుండ పోయినట్టు లావేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దీంతో అత్యంత పాసవికంగా ఆశిరి నాయుడు హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన 6 రోజుల తరువాత ఈ నెల 9 న తాళ్లవలస సమీపంలోని పాడుబడిన బావిలో దొరికన అసిరినాయుడు మొండెం ఇతడుట్రాక్టర్ డ్రైవర్ పని చేస్తున్న మృతుడు అసిరినాయుడు. అయితే డ్రైవర్ అసిరినాయుడు నిందితుడు గౌరినాయుడు గత ఐదు సంవత్సరాలుగా ఫ్రెండ్స్.
అయితే వీరిద్దరూ అప్పుడప్పుడు కలిసి రాత్రి వేళల్లో కుందేళ్లు, అడవి పందుల వేటకు వెళ్లేవారు. ఈ పరిచయంతో నిందితుడు మృతుడి ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో మృతుడి భార్య మంజుతో నిందితుడికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ నెల 2 నిందితుడు, మృతుడు కలిసి వేటకు వెళ్లే సమయంలో నాటు తుపాకీ, కత్తిని వెంట తీసుకెళ్లారు. రాత్రి 7 గంటల టైమ్‌లో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ జరగడంతో, నిందితుడు తన వద్ద ఉన్న నాటు తుపాకీతో అసిరినాయుడి వీపు వెనుక భాగంలో కాల్చాడు. దీంతో అసిరినాయుడు కిందపడిపోగా, వెంట తీసుకెళ్లిన కత్తితో అతని తలను మొండెం నుంచి వేరు చేశాడు.
Also read: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణకు రూ.30 వేల కోట్ల సాయంపై కీలక చర్చ!
అనంతరం మృతదేహాన్ని అక్కడ ఉన్న పాడుబడిన బావిలో పడవేసి, తల భాగాన్ని సుమారు 300 మీటర్ల దూరంలోని తాటిచెట్ల మధ్య పూడ్చిపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతుడి మోటార్ సైకిల్‌ను తీసుకెళ్లి రణస్థలం మండలం అర్జునువలస చెరువులో పడేసి, హత్యకు ఉపయోగించిన నాటు తుపాకీ, కత్తిని తాళ్లవలస లేఅవుట్ ప్రాంతంలో దాచిపెట్టి వైజాగ్‌కు వెళ్లిపోయాడు. తిరిగి దాచిపెట్టిన ఆయుధాలను తీసుకెళ్లేందుకు వచ్చిన సమయంలో పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు నిందితుడిని, అదుపులోకి తీసుకుని కేసు ప్రాపర్టీ స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు అదృశ్యమైన అసిరినాయుడు కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రణస్థలం మండలం అర్జునువలస చెరువులో ఆయనకు చెందిన మోటార్ సైకిల్‌ను గుర్తించారు. డ్రోన్ కెమెరాలు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దర్యాప్తులో భాగంగా మృతుడు అసిరినాయుడు, అతని భార్య మంజు, మృతుడి స్నేహితుడైన గౌరినాయుడు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో ఈ నెల 14 న సాయంత్రం 5 గంటలకు లావేరు మండలం తాళ్లవలస గ్రామ సమీపంలోని బొడ్డపాడు వెళ్లే మార్గంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Also read: కవితకు రేవంత్ స్క్రిప్ట్ అక్కర్లేదు.. మీ బాగోతాలన్నీ ఆమెకు తెలుసు: ఆది శ్రీనివాస్