Nandyal Road Accident: ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. అతివేగం ప్రమాదకరం అయినప్పటికి చాలా మంది వినకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు గాలలో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద ఇన్నోవా కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
Also Read: మలేషియాలో తెలంగాణ వాసి మృతి, కడసారి చూపుకోసం కూతుళ్ల ఎదురుచూపు
విషయంలోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం తుంకూర్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు కలసి శ్రీశైలం మల్లికార్జున స్వామి, మహానంది దర్శనానికి వెళ్లి తిరిగి కర్ణాటకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలి మండలం పోదుడి గ్రామం వద్ద ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడి స్థానికులు వీరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థాలనికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపగా మృతులు సంతోష్, లోకోష్, నవీన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.