Migrant Dies In Malaysia: ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. అప్పులపాలయ్యి కొంతమంది, కుటుంబ బాధ్యతల రీత్య మరికొంతమంది దేశాలకు వలస వెళ్తుంటారు. అలా వెళ్లినవారు కాస్తోకూస్తో.. డబ్బులు సంపాదించుకొని స్వదేశానికి తిరిగి వస్తుంటారు. కానీ.. అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఎదురై.. ఇంటికి తిరిగిరాలేక తిప్పలు పడే అభాగ్యుల గురించి తరచూ వింటూనే ఉంటాం. ఇంకొంతమంది అక్కడే మరణిస్తే.. చివరిచూపు కోసం వారి కుటుంబాలు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. జగిత్యాల జిల్లా హబ్సీపూర్‌కి చెందిన కారం నర్సయ్య కుటుంబ పరిస్థితి కూడా ఇలాంటిదే..
23 ఏళ్ళ క్రితం మలేషియా వెళ్లిన నర్సయ్య కష్టపడుతూ ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉన్నాడు, నర్సయ్య ముగ్గురు కూతుళ్లు కాగా.. ఇండియాకు రాకుండా మలేషియాలోనే ఉండి పెద్దకూతురుకు వివాహం జరిపించాడు.. ఇక్కడి వరకు బానే ఉంది.. కానీ ఏడాది నుండి ఆర్థికంగా ఇబ్బంది పడుతు… గత ఆరు నెలలుగా కుటుంబ సభ్యులకు అందుబాటులో కూడా లేకుండా పోయాడు. నర్సయ్య అందుబాటులో లేకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురైన కుటుంబ సభ్యులు నర్సయ్య పని చేసే కంపెనీలో తోటి వర్కర్లకు ఆరా తీయగా, ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. దీంతో మాజీ ఎమ్మెల్సీ జీవన్రె, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఎంబసీ అధికారుల ద్వారా విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా మలేషియాలోని కొందరు ప్రవాసీల ద్వారా నాలుగు రోజుల క్రితం నర్సయ్య మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న నర్సయ్య కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 23 ఏళ్లుగా తన తండ్రిని చూడలేదని, కనీసం చివరి చూపైనా చూసేలా తన తండ్రి శవాన్ని తీసుకురావాలని కూతుళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మేడారం వెళ్లి వస్తుండగా.. ట్రాక్టర్, లారీ ఢీ.. స్పాట్‌లోనే 18 మంది
తన తండ్రి చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడిందని ప్రభుత్వ ఎలాగైనా ఆదుకోవాలని కూతుళ్లు , భార్య వేడుకుంటున్నారు. నర్సయ్య శవాన్ని రప్పించే విధంగా అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ జీవన్ రెడీ, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. అలాగే ఆ కుటుంబానికి న్యాయం చేకూరుస్తామని చేప్పారు.