BigTV English

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

Konaseema Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అమలాపురంలోని ఓ ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా బ్లాస్ట్ జరిగి ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అమలాపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఇంట్లో దీపావళి మందుగుండు సామాగ్రి తయారు చేస్తుండగా పటాస్ మందు పేలడంతో భారీ స్థాయిలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. డా.బీ ఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం పట్టణ పరిధిలో ఉన్న రావులు చెరువు ప్రాంతంలో ఒక ఇంటిలో  దీపావళి మందుగుండు సామాగ్రి సంబంధించి పటాస్ మందు తయారు చేస్తున్న క్రమంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలో అదే సమయంలో అక్కడ గ్యాస్ సిలండర్ కూడా పేలడంతో ఈ ప్రమాదం మరింత దారుణంగా ఉంది.

Also Read: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు


ఈ తరుణంలో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అక్కడున్న స్థానికుల ఈ సమాచారాన్ని ఎమ్మెల్యే తోపాటు, పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని హుటాహూటిన అమలాపురం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.

ఆస్పత్రికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే బాధితులను పరామర్శించారు. ఈ నేపథ్యంలో వైద్యులకు కూడా మెరుగైన సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అమలాపురం పట్టణంలోని రావుల చెరువు ప్రాంతంలో వినాయకుని నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×