BigTV English

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? నిందితుల సమాధానాలకు పోలీసులకు చెమటలు పడుతున్నాయా? పోలీసుల ప్రశ్నలకు నిందితులకు ఉక్కపోస్తుందా? అదుర్స్ మూవీ తరహాలో డైలాగులు వినిపిస్తున్నాయా? నెక్ట్స్ ఏం చేయబోతున్నారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు నిందితులను వెంటాడుతున్నాయి.


ప్రొడ్యూసర్, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెరకెక్కించిన మూవీ అదుర్స్. జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టింది. అందులో విలన్ వద్ద తెలీదు.. గుర్తు లేదు, మరిచిపోయానని జూనియర్ ఎన్టీఆర్ మూడు మాటలు మాత్రమే చెబుతున్నాడు. ఆ మూవీని వైసీపీ నేతలు ఎన్నిసార్లు చూశారో తెలీదుగానీ అవే సమాధానాలు చెబుతున్నారట.

అదేనండి.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసును పోలీసుల విచారణ జరుగుతోంది. ఈ ఘటనలో మాజీ ఎంపీ నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పాత్రపై మంగళగిరి పోలీసులు విచారణ చేస్తున్నారు.


డీటేల్స్ అన్నీ దగ్గర పెట్టుకుని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు కేవలం మూడు మూడు ముక్కలు చెబుతున్నారు. తెలీదు.. గుర్తు లేదు.. మరిచిపోయాను చెప్పడంతో పోలీసులు షాకవుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు.

ALSO READ: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు న్యాయస్థానం ఇచ్చిన రెండురోజుల పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియనుంది. మరోసారి ఆయన్ని కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. అంతకుముందు ఇదే కేసులో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, రఘురాములను పోలీసులు విచారించారు. వాళ్లు కూడా ఇదే సమాధానాలు చెప్పారట.

ఫోన్ల గురించి అడిగితే తాము ఉపయోగించలేదని బదులు ఇచ్చారట. దాడి సంబంధించి విజువల్స్ చూపించి ఆ నేత ఎవరు అంటే తెలీదని చెబుతున్నారని సమాచారం. ఆయా నేతలు చెప్పిన వివరాలు సుప్రీంకోర్టుకు సమర్పించి వీరిని కస్టడీకి తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారట మంగళగిరి పోలీసులు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×