Fire accident in AP: ఆహారాన్ని వండుకోవడం నుంచి దేశ ఆర్ధిక ప్రగతికి మూలమైన పారిశ్రామిక రంగాన్ని నడిపిస్తుంది అగ్ని. దేశం మొత్తంలో వేల కోట్ల రూపాయల ఆర్ధిక కార్యకలాపాలకు ముడిపడి ఉంది అగ్నితోనే. అదే సమయంలో ప్రమాదాల రూపంలో అగ్ని చేస్తున్న నష్టం తక్కువేమి కాదు.. దేశంలో అనేక ప్రాంతాల్లో తరుచూ అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. దీనివల్ల వేల కోట్ల ఆస్థి నష్టంతో పాటు.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తాటాకు నిప్పు అంటుకోవడంతో ఇంటికి మంటలు వ్యాప్తించాయి. అయితే మంటల్లో ఇంట్లో నిద్రిస్తున్న దిగ్యాంగుడు నామాల దానియేలు స్వాట్ లోనే చనిపోయాడు. దివ్యాంగుడు కావడంతో మంటల్లోంచి చిక్కుకొని తప్పించుకోలేకపోయాడు. దీంతో మంటల్లోనే సజీవ దహనం అయ్యాడు. అయితే స్థానికులు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అప్పటికే దానియేలు చనిపోయాడు. హుటాహుటినా ఘటన స్థలానానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. మంటల్ని అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ బాపట్ల జిల్లా పర్చూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. రామాలయం వీధిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఇళ్లు దగ్ధమైంది. ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న అక్కాచెల్లెళ్లు దాసరి నాగమణి, దాసరి మాధవీలత సజీవ దహనం అయ్యారు. బిడ్డలను కాపాడేందుకు తల్లి లక్ష్మీరాజ్యం విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా అప్పటికే ఇద్దరు కుమార్తెలు చనిపోయారు. ఇటు తీవ్ర గాయాలతో లక్ష్మీరాజ్యం బయటపడింది. దీంతో గాయాలపాలైన లక్ష్మీరాజ్యన్ని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే
ఆదివారం నాడు.. హిమాయత్ నగర్ లోని మినర్వా హోటల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ లోని కిచెన్ ఎగ్జాస్ట్ నుండి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్నది ఇంకా తెలియ రాలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.