CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇవాళ, రేపు కుప్పంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ద్రవిడ వర్సిటీ హెలిపాడ్ వద్ద ఆయన ల్యాండ్ అవుతారు. ద్రావిడవర్సిటీ ఆడిటోరియంలో.. స్వర్ణ కుప్పం విజన్-29 ఆవిష్కరణ.. చర్చా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. గుడిపల్లి మండలం అగరం కొత్తపల్లిలో పర్యటించి.. మహిళలలో ముఖాముఖి నిర్వహించనున్నారు.
సాయంత్రం నడుమూరులో సౌర విద్యుత్ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొని.. ఆయన యువతలో ఇష్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు కుప్పం మున్సిపాలిటీ శీగలపల్లెలో ప్రకృతి వ్యవసాయాన్ని సందర్శించి.. రైతులతో చర్చించనున్నారు. వీటితో పాటు పలు అభివృద్ధి పనుల్లోనూ సీఎం చంద్రబాబు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.
రాత్రికి ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు కుప్పం టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. అదే రోజు మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రాత్రికి కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేయనున్నారు. 8వ తేదీ ఉదయం విశాఖపట్నం వెళ్లి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Also Read: మీకు భూమి ఉందా.. ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం మీకోసమే!
మరోవైపు కుప్పంలో రెండు దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనుంది. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ నివేదికను అధికారులు సిద్ధం చేశారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం ఆకారంలో నిర్మాణం జరగనుంది. విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.