BigTV English

Ap Home Minister : 48 గంటల్లోనే అత్తా కోడళ్లపై అత్యాచారం నిందితులను అరెస్ట్ చేశాం : హోంమంత్రి అనిత

Ap Home Minister : 48 గంటల్లోనే అత్తా కోడళ్లపై అత్యాచారం నిందితులను అరెస్ట్ చేశాం : హోంమంత్రి అనిత

Home Minister Anitha : ఆంధ్రప్రదేశ్​ శ్రీసత్యసాయి జిల్లాలో అర్థరాత్రి అత్తాకోడళ్లపై జరిగిన అత్యాచారం ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు 48 గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే నిందితులకు కఠిన శిక్షలు వేగంగా పడాలన్న లక్ష్యంతో కేసును స్పెషల్​ కోర్టుకు అప్పగించామన్నారు.


మహిళల సేఫ్టీకే ఫస్ట్ ప్రయారిటీ : 

ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతగా భావిస్తోందన్న అనిత, సత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనలో కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగించడమే ఇందుకు నిదర్శమన్నారు. వేగవంతమైన విచారణ కోసమే ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు భరోసా ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమన్నారు.


ఒకరిపై 37 కేసులు…

నిందితుల్లో ఐదుగురు పట్టుబడ్డారని, అందులో ఒకరిపై అత్యాచార అభియోగాలతో పాటు మరో 37 కేసులు ఉన్నట్లు హోంమంత్రి వెల్లడించారు. ఇక మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై తాము సహించబోమని అల్టిమేటం జారీ చేశారు.

సీసీటీవీలను ప్రజలంతా ఏర్పాటు చేసుకోవాలి…

ఏపీలో ప్రజలంతా సీసీటీవీ కెమెరాలను తప్పక ఏర్పాటు చేసుకోవాలని అనిత సూచించారు. అవి లేని చోట డ్రోన్స్‌ వినియోగించాలన్నారు. డ్రోన్స్‌ కూడా లేకపోతే సెల్​ఫోన్లను వాడుకోవాలన్నారు. ఏ చిన్న ఇబ్బంది కలిగినా వీడియో తీస్తున్న సమాజం అని, తమకు అలా సమాచారం అందితే వారి వివరాలను ఎక్కడా బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. నేరాల నియంత్రణే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యమన్నారు. ఎక్కడ నేరం జరిగినా అలెర్ట్ అవ్వాలని చెప్పారు. నేరం చేస్తే నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

ప్రజలంతా కలిసిరావాలి…

ఇక నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ద్వారా నిఘూ పెట్టేందుకు కార్యచరణ ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ప్రజలనూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నామన్నారు. కాలనీల్లో, ఇళ్ల వద్ద, వ్యాపార వాణిజ్య సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పోలీస్ శాఖకు అనుసంధానం చేయాలని సూచించారు. ఫలితంగానే నేర నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.

నేర నియంత్రం కోసం అలా చేయాలి…

పోలీసులకు ఆయుధాలున్నట్లు, పబ్లిక్ వద్ద సెల్​ ఫోన్లు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. దీంతో ఆయా సాధనాలను ఉపయోగించి క్రైమ్ కంట్రోల్ కోసం సహకరించాలని సూచించారు. నేరాలపై పోలీసులకు సమాచారం ఇచ్చే పౌరుల వివరాలు తాము ఎవరితోనూ పంచుకోమని, అలాంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, పోలీసులతో సిటిజన్లు సహకరించాలని కోరారు.

Also Read : ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

Related News

AP Mega DSC: నవంబర్‌లో టెట్ ఎక్జామ్ .. ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

YS Sharmila: ఓటు చోరీ జరిగింది.. త్వరలోనే ఆధారాలతో బయటపెడతాం: షర్మిల

Onion Price: కిలో ఉల్లి రూ.5 మాత్రమే.. ఎక్కడో కాదు మన రాష్ట్రాల్లోనే!

Aghori Hulchul In Guntur: చంద్రగ్రహణం రోజు అఘోరాల పూజలు.. విరుగుడుగా శాంతి పూజలు

AP Politics: ఏపీని షేక్ చేస్తున్న ఐఏఎస్ గిరిషా.. అసలు కథ ఇదే..

CM Progress Report: ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు రివ్యూ..

Vijayawada News: అంతా ఉచిత మహిమ.. బస్సులో సీటు కోసం మహిళలు ఫైటింగ్, వీడియో వైరల్

Nara Devansh: తాతకు తగ్గ మనవడు.. నారా దేవాన్ష్‌కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు

Big Stories

×