BigTV English

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

Vijayasai Reddy EVM| ఏపీలో శాశ్వతంగా అధికారం తమదే అన్న ధీమాతో వైసీపీ పాలన సాగించింది. సీన్ కట్ చేస్తే గత ఎన్నికల్లో అంతకు ముందు సాధించిన సీట్లలో కనీసం పదో వంతు కూడా సాధించలేకపోయింది. దానిపై ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తర్వాత ఈవీఎంల పనితీరును తప్పుపడుతూ బ్యాలెట్ పేపర్ మంత్రం పఠిస్తున్నారు. ఆయన బాటలో ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఈవీఎంల టాంపరింగ్‌ల గురించి ట్విట్లర్లో హడావుడి మొదలుపెట్టారు. మరి జగన్ రెడ్డి, సాయిరెడ్డిలు కూడబలుక్కునే ఆ ప్రచారం చేస్తున్నారో ఏమో కాని .. నాలుగు నెలల తర్వత వారి విశ్లేషణలు విమర్శల పాలవుతున్నాయి.


ఏపీలో వైసీపీ 2019 ఎన్నికల్లో అనూహ్యంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు ఈవీఎంల టాంపరింగ్‌పై రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి … అప్పట్లో టీడీపీ నేతలు సైతం ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు … దాంతో మీడియా ముందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈవీఎంపై బటన్ నొక్కితే వీవీ ప్యాడ్‌పై ఏ పార్టీకి ఓటేశామో స్పష్టం అవుతుందని .. అందుకే ఓటేసిన 80 శాతం జనాభాలో ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదని గొప్పగా చెప్పుకొచ్చారు. అంతేనా అసలు ఈవీఎంలతో పోలింగ్ ప్రారంభమయ్యే ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని… అన్ని పార్టీల ఏజెంట్లు అక్కడ ఉంటారని అటువంటప్పుడు టాంపరింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

Also Read: సిఐడీ చేతికి టీడీపీ ఆఫీసుపై దాడుల కేసులు.. విచారణ వేగవంతం


ఇక ఇప్పుడు హరియాణా ఎన్నికల్లో వరుసగా మూడోసారి బీజేపీ విజయం నమోదు చేసింది. కౌంటింగ్‌ ప్రారంభంలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. 90 స్థానాలకు గాను 37 స్థానాలకే పరిమతమైంది. అయితే, ఈ ఫలితాలపై కాంగ్రెస్‌ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసీ పనితీరుతో పాటు ఈవీఎంలపైనా పలు ఆరోపణలు చేస్తున్నారు.. ఇండియా కూటమికి దగ్గరవ్వాలని చూస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం కాంగ్రెస్‌తో గొంతు కలుపుతున్నారు. ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్ పద్దతి ఫాలో అవ్వాలని ట్వీట్లు చేస్తున్నారు …ఈవీఎంల వ్యవహారంలో అనుమానాలను బయటపెడుతూ.. పలు పార్టీలను సైతం మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. పలు దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ పద్దతిని కొనసాగిస్తున్నారని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతున్నారు.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘోర పరాజయం పాలై నాలుగు నెలలు గడిచింది. ఇప్పటికీ ఆ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించుకోవడం లేదు… అసలు ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు తమ పార్టీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని చెబుతున్నారు. ఘోర పరాజయం పాలైన నాలుగు నెలల తరువాత కూడా ఈవీఎంలనే నిందిస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

జగన్‌తో పాటే తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని ఎక్స్ వేదికగా ఆరోపించారు. అక్కడితో ఆగకుండా హర్యానా ఎన్నికలలో బీజేపీ విజయానికి కూడా ఈవీఎంల ట్యాంపరింగే కారణమన్నారు. దేశం మొత్తం మీద మొదటి నాలుగు దశల పోలింగులో బీజేపీకి ఎదురుగాలి వీచిందని స్పష్టంగా అర్థమైందని… రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయని. కానీ అయిదు ,ఆరు దశలలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ముఖ్యంగా అసెంబ్లీకి పార్లమెంట్ కి కలిపి జరిగిన ఏపీలో ఈవీఎంలు టాంపరింగ్ చేశారని ట్వీట్లో ఆరోపించారు.

ఇది చంద్రబాబు, లోకేష్మరి కొంతమంది కలిసి చేసిన కుట్రంట. ఎన్నికల ముందు చంద్రబాబు జర్మనీ, దుబాయ్, లోకేష్ ఇటలీ, జర్మనీ, దుబాయ్ ప్రయాణాలు ఈ ఈవీఎంల టాంపరింగ్ మరియు డబ్బులు బదిలీ కోసమే అని సాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక బోడిగుండుకీ మోకాలికీ ముడి పెట్టినట్లు చంద్రబాబు కు లోకేష్ కు హిందూమతం ఫై కానీ, భగవంతుడి ఫై కానీ నమ్మకంలేదు. వారి కులమే ఒక మతం అని నమ్మే వ్యక్తులని చిత్రమైన విమర్శలు చేస్తున్నారు.

ఒకవైపు జగన్, మరోవైపు సాయిరెడ్డి చేస్తున్న వాదనలు సంచలనం రేపుతున్నాయి. విజయసాయి అయితే ఒక అడుగు ముందుకేసి బీజేపీకి కూడా టాంపరింగ్‌లో భాగం ఉందన్నట్లు ట్వీట్‌లో ఆరోపిస్తున్నారు. హర్యానాలో బీజేపీ వరుసగా మూడో సారి విజయం సాధించడం వెనుక ఉన్నది ఈవీఎం ట్యాంప రింగేనని విజయసాయి ఆరోపణలు కచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం, మరీ ముఖ్యంగా మోడీ, అమిత్ షాలకు ఆగ్రహం కలిగించడం ఖాయం.

గత అయిదేళ్లలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించారు. జగన్‌కు ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్లు, ఇతరాత్రా అవసరాలను దగ్గరుంచి చూసుకున్నారన్న ప్రచారం ఉంది. అయితే తర్వాత తర్వాత సాయిరెడ్డికి జగన్ పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో ఆయన ఏకంగా మోడీ, షాలకు ఆగ్రహం తెప్పించేలా ట్వీట్లు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర పెద్దలకు కోపమొస్తే జరిగేదేంటో అందరికీ తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకుంటుంది. జగన్ తో పాటు ఆ కేసుల్లో ఏ2గా ఉన్న సాయిరెడ్డి కూడా చిక్కుల్లో పడతారు. మరలాంటిది ఈ తాజా ట్వీట్ల యుద్దం వెనుక లెక్కలేంటో వారికే తెలియాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×