BigTV English

Bigg Boss 8 Telugu Promo: వెక్కివెక్కి ఏడ్చిన యష్మీ.. అవినాష్ భార్యపై పృథ్వి చీప్ కామెంట్స్, ఇదేనా నీ సంస్కారం?

Bigg Boss 8 Telugu Promo: వెక్కివెక్కి ఏడ్చిన యష్మీ.. అవినాష్ భార్యపై పృథ్వి చీప్ కామెంట్స్, ఇదేనా నీ సంస్కారం?

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత రెండోసారి నామినేషన్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు లేనంత ఇంట్రెస్టింగ్‌గా ఈసారి నామినేషన్స్ జరుగుతున్నాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. మామూలుగా సోమవారమే నామినేషన్స్ అనేవి ప్రసారమవుతాయి. కానీ ఈసారి జరుగుతున్న గొడవల వల్ల ఇవి రెండురోజులు ప్రసారమవుతున్నాయి. ఇందులో ఓజీ వర్సెస్ రాయల్స్‌గా టీమ్స్ విడిపోయాయని స్పష్టంగా కనిపిస్తోంది. దానివల్లే నామినేషన్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల కాగా.. అందులో అవినాష్, పృథ్వి మధ్య జరిగిన గొడవ హైలెట్ అయ్యింది.


నిఖిల్ ప్లాన్

ఫ్రెండ్‌షిప్‌ను పక్కన పెట్టేసి అందరూ ప్రేరణను టార్గెట్ చేశారు. ఈ విషయం బయటపడడంతో యష్మీ ఫేక్ ఏడుపు మొదలుపెట్టింది. ‘‘నేను ఫ్రెండ్‌షిప్ అనే పదాన్ని ఉపయోగించి హర్ట్ చేసే మనిషిని కాదు’’ అంటూ వెక్కివెక్కి ఏడ్చింది. దానికి ప్రేరణ కూడా ఫీల్ అయ్యింది. ఇదంతా చూసిన నిఖిల్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ‘‘వాళ్లు కావాలనే మన టీమ్ వాళ్లను ఏదో ఒక పాయింట్ చెప్పి నామినేట్ చేస్తున్నారు. తేజను ఎలాగైనా నామినేట్ చేయాల్సిందే’’ అంటూ తేజనే టార్గెట్ చేసింది ఓజీ టీమ్. ఆ తర్వాత వచ్చిన విష్ణుప్రియా.. నయని పావనని నామినేట్ చేస్తూ ఇది రివెంజ్ నామినేషన్ అని ఓపెన్‌గా చెప్పేసింది. అది బిగ్ బాస్ సైతం అంగీకరించలేదు. దీంతో ఓజీ ప్లాన్ ఏంటో తేజకు అర్థమయ్యింది.


Also Read: నామినేషన్ రచ్చ.. తారస్థాయికి చేరిన గొడవ..!

తేజ వర్సెస్ ఓజీ

‘‘ఒకరు నా పేరు చెప్పి, మరొకరు ఏదో ఒక పిచ్చి కారణం చెప్పేస్తే నేను నామినేట్ అవుతానని గ్రూప్‌గా ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. దీనిని ఓజీ వర్సెస్ తేజ చేసేస్తున్నారు. మీ ఇష్టం. మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడుతా’’ అని వార్నింగ్ ఇచ్చాడు తేజ. ఆ తర్వాత పృథ్వి వచ్చి అవినాష్‌ను నామినేట్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ‘‘ప్రోమో చూసి నువ్వు కేవలం రెండు టాస్కుల్లోనే కనిపించావు అని నామినేట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు’’ అని కారణం చెప్పాడు. ‘‘నేను చూసిన ఎపిసోడ్స్‌లో ఆయన రెండు, మూడు టాస్కుల్లో తప్పా మరెక్కడా కనిపించలేదు. నా భార్య కూడా బిగ్ బాస్ రెగ్యులర్‌గా చూసింది’’ అంటూ తన భార్య పేరును మధ్యలోకి తీసుకొచ్చాడు అవినాష్.

పనులు చేయవు

‘‘మీ భార్య రెగ్యులర్‌గా చూసుంటే ఆమెనే బిగ్ బాస్‌కు రావాల్సింది. మీరెందుకు వచ్చారు’’ అని కౌంటర్ ఇచ్చాడు పృథ్వి. దానికి అవినాష్ సీరియస్ అయ్యాడు. ‘‘సోఫాపై కూర్చుంటావు. అక్కడి నుండి లేవవు. టాస్కులు తప్పా ఇంకేమీ ఆడవు. ఇన్నిరోజుల నుండి ఏం పనిచేశావు’’ అంటూ ప్రశ్నించాడు. ‘‘కామెడీ తప్పా నువ్వేం చేశావు’’ అని పృథ్వి రివర్స్ అయ్యాడు. ‘‘నువ్వు ఏ టాస్క్ ఆడలేదు. గతవారం నేను అదే చెప్పాను. ఈవారం గంగవ్వ కూడా అదే చెప్పింది’’ అన్నాడు అవినాష్. ‘‘గంగవ్వ గురించి ఎందుకు చెప్తున్నావురా’’ అంటూ నోరుజారాడు పృథ్వి. ‘రా’ అనకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు అవినాష్, పృథ్వికి సంస్కారం లేదన్నాడు. అలా ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది.

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Big Stories

×