Kadapa politics: కడప జిల్లాపై జనసేన ఫోకస్ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు అక్కడికి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వైసీపీ శ్రేణులు చేస్తున్న దురాగతాలను ఎండగట్టారు. ఒకానొక దశలో కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ధీటుగా జగన్ పేరిట ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కడపలోని స్థానిక ఆర్ట్స్ కాలేజ్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరిట ఫ్లెక్సీ వెలిసింది. టైటిల్ మాత్రం కలాంగారు మనం మనకు వచ్చే కలలు నెరవేర్చుకునే దానికి కష్టపడ మన్నారు వేరే వాళ్లవి కావు అని రాసుంది. పవన్ ఫ్లెక్సీలో 21తో గేమ్ ఛేంజర్ అవ్వలేదని, 50 తీసుకోమని చెప్పినా వినలేదని అందులో ప్రస్తావించారు. ఇంతకీ 21 ఏంటి? 50 ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్లు దావోస్ వెళ్లారని, అక్కడ వాళ్లను పట్టించుకునే నాధుడు లేదన్నారు. కనీసం మీరు వెళ్లినా నాలుగు కంపెనీలు వచ్చేవంటూ అందులో ప్రస్తావించారు. కనీసం ప్రతిపక్షంలో ఉన్నా మనకు మంచి పేరు ఉంటుందని, లేకపోతే ఆ దరిద్రం అంతా మన నెత్తికి చుట్టుకుందన్నా, తట్టుకోలేక పోతున్నామన్నా అని రాసి ఉంది.
డిప్యూటీ సీఎం పవన్ ఫ్లెక్సీకి ధీటుగా వైసీపీ నుంచి జగన్ పేరిట ఆ పక్కనే మరొకటి వెలిసింది. జగన్ బ్రాండ్ అంటే ఏందో తెలుసునా మీకు అంటూ కాసింత రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి ఫ్యాన్ పార్టీ శ్రేణులు. వైసీపీ కార్యకర్త అంటేనే ఒక బ్రాండ్ అని, కూటమిని చీల్చాలనేది ఉండదు.. మాకు స్వలాభం అస్సలు ఉండదని ప్రస్తావించారు.
లీడర్లు వస్తూంటారు.. పోతుంటారు., పార్టీని నడిపించేది మా లాంటి కరుడు కట్టిన కార్యకర్తలే మా జగనన్న ఆస్తి.. సొంతం కూడా పేర్కొన్నారు. అలాగే కూటమికి వచ్చిన సీట్ల గురించి ప్రస్తావించారు. ఈ లెక్కన కడపలో ఏదో జరుగుతోందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.
వీటిని చూసిన కొందరు నాయకులు మాత్రం ఈ ఫ్లెక్సీ గోలేంటి? అంటున్నారు. మరికొందరైతే కావాలనే ఈ విధంగా చేయిస్తున్నారని చెప్పేవాళ్లే లేకపోలేదు. ఈ ఫ్లెక్సీ వార్ రాబోయే రోజుల్లో ఎటువైపు టర్న్ అవుతుందో చూడాలి.
కడపలో ఫ్లెక్సీ వార్..
స్థానిక ఆర్ట్స్ కాలేజీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ వెలిసిన ఫ్లెక్సీలు
21తో గేమ్ ఛేంజర్ అవ్వలేము.. 50 తీసుకోవాలి అంటూ బ్యానర్లు
వైసీపీ కార్యకర్తలు భయపడరని.. జై జగన్, జోహార్ వైఎస్సార్ అంటూ ఫ్లెక్సీలు
కడపలో హాట్ టాపిక్ గా మారిన ఫ్లెక్సీల… pic.twitter.com/SVNkH10kWU
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2025