Republic Day: తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీసుల నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ గౌరవవందనం స్వీకరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అన్నారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జెండా వందనం అనంతరం ప్రసంగించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని.. రైతులకు ఆర్థికభారం లేకుండా రుణమాఫీ చేసినట్లు తెలిపారు. సాగుయోగ్యమైన భూములకు సర్కారు రైతు భరోసా అందిస్తోందని.. సాంస్కృతిక అస్తిత్వాన్ని చిహ్నంగా తెలంగాణ తల్లి విగ్రహం నిర్మించినట్లు గవర్నర్ చెప్పారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తోందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో 2024 వర్షాకాలంలో రికార్డు స్థాయిలో 1.59 కోట్ల టన్నుల వరి ధాన్యం పండింది. దేశంలోనే తెలంగాణ అత్యధిక ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం తన మాటకు కట్టుబడి రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. 25 లక్షల మందికి పైగా రైతుల రుణనమాఫీ చేశాం అన్నారు.
రైతు భరోసా పథకం కింద ఎకరాకు అందించే పెట్టుబడి సాయాన్ని రూ.12 వేలు అందిస్తామని.. భూమిలేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయబోతోందని ఈ సందర్బంగా తెలియజేశారు. 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద కనీసం 20 రోజులు పని చేసినవారికి ఈ పథకం వర్తిస్తుందని తెలియజేశారు.
రైతుల సంక్షేమం కోసం అవసరమైన సహాయ, సహకారాలు అందించడానికి వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు సౌకర్యం, గృహజ్యోతి స్రీనిధి , 500 కి గ్యాస్ సిలిండర్, 100 పైగా ఓట్ల వరకు సోలార్ ప్లాంట్ ఇలాంటి పథకాల అమలు చేసామన్నారు.
Also Read: గణతంత్ర వేడుకల్లో విదేశీ సైన్యం కవాతు.. చరిత్రలో ఇదే మొదటిసారి విశేషం
యువతకు స్కిల్ అందించడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. ప్రజాప్రభుత్వం తెలంగాణకు సంస్కృతికి పెద్దపీట వేస్తోంది. అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించాం అని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రజాభవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించి.. గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు.
సెక్రటేరియట్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగువరవేశారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. సెక్రటేరియట్‌లోని ఉద్యోగులతో కలసి సందడి చేశారు.