BigTV English

Food Safety : సుబ్బయ్య హోటల్ ఫుడ్ అదుర్స్ అంటారు – లోపల ఫుడ్ చూస్తే బెదురుతారు

Food Safety : సుబ్బయ్య హోటల్ ఫుడ్ అదుర్స్ అంటారు – లోపల ఫుడ్ చూస్తే బెదురుతారు

Food Safety : 


⦿ కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
⦿ సుబ్బయ్య గ్రూప్స్‌కు చెందిన మూడు హోటళ్లపై దాడులు
⦿ తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాల గుర్తింపు
⦿ వ్యాలిడిటీ అయిపోయిన నిల్వ పచ్చళ్లు, పొడులు విక్రయం
⦿ మరోసారి ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయన్న అధికారులు

సుబ్బయ్య గారి హోటల్‌లో భోజనమంటే మామూలుగా ఉండదు. హోటల్‌లో ఫుల్ మీల్స్ ఒక్కటే కాదు.. హోటల్ కూడా ఫుల్ ఫేమస్. తెలుగు రాష్ట్రాల్లో చాలా బ్రాంచ్‌లున్నాయ్. కానీ.. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలిన విషయాలే.. అందరినీ షాక్‌కి గురిచేస్తున్నాయ్. అరటి ఆకుతో భోజనం.. ప్లేటు నిండా కనిపించే వెరైటీలు.. కొసరి కొసరి వడ్డించే విధానం.. దగ్గరుండి మరీ తినిపించే ఆప్యాయత.. ఇదంతా.. ఒక్క సుబ్బయ్యగారి హోటల్‌లోనే కనిపిస్తుంది.


అక్కడి టేస్ట్, భోజనం తింటే వచ్చే ఫీల్ ఎక్కడా రాదని.. చాలా మంది భోజన ప్రియులు చెబుతుంటారు. అలా ఉంటుంది.. సుబ్బయ్యగారి హోటల్! ఒక్కమాటలో చెప్పాలంటే.. అది హోటల్ కాదు. తెలుగు రుచులన్నీ దొరికే హెవెన్ అంటూ పొగుడుతుంటారు. కాకినాడలో మొదలైన ఈ హోటల్ ప్రస్థానం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక బ్రాంచ్‌లతో.. తన రుచుల్ని అందిస్తోంది. తన ప్రత్యేక ఆంధ్రా రుచుల్ని.. అందరికీ అందిస్తూ సుబ్బయ్య హోటల్ ఓ బ్రాండ్ గా మారిపోయింది.

సుబ్బయ్య గారి హోటల్ అంటేనే.. నోరూరించే క్వాలిటీ, పొట్ట పగిలిపోయేంత క్వాంటిటీ అనే టాక్ ఉంది. అయితే.. తాజాగా నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో ఈ హోటల్ శుచీ, శుభ్రతలతో సహా అనేక విషయాలపై అనుమానాలు రేకెత్తత్తున్నాయి. పైగా.. తన తొలి, ప్రత్యేక బ్రాంచ్ గా చెప్పుకునే కాకినాడలోనే ఫుడ్ సెఫ్టీ విధివిధానాల్లో డొల్లతనం బయటపడడం.. అందరినీ షాక్‌కి గురయ్యేలా చేస్తోంది.

ఇటీవల కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టి అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత, కనీస జాగ్రత్తలు పాటించని వాటిలో కొన్నింటిని మూసేస్తుంటే, మరికొన్నింటికి జరిమానాలు విధిస్తున్నారు. అలా… తాజాగా ది ఫేమస్ సుబ్బయ్య హోటల్ లోనూ ఆహార భద్రతా ప్రమాణాల అధికారులు దాడులు నిర్వహించారు. సుబ్బయ్య గ్రూపునకు చెందిన 3 హోటళ్లల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులకు నమ్మలేని నిజాలు తెలిశాయి. ఇన్నాళ్లు ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడంతో ఉన్నత ప్రమాణాలు పాటిస్తుందనుకున్న సుబ్బయ్య హోటల్.. మిగతా వాళ్లలాగే కాలం చెల్లిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలింది. విక్రయించకూడని నిల్వ పచ్చళ్లు, పొడులను అమ్ముతున్నట్లుగా తేల్చారు.

Also Read :  అనుకున్నట్టుగా వైసీపీలోకి శైలజనాథ్.. కండువా కప్పిన జగన్

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ బ్రాంచ్‌లన్నింటికి.. ఇక్కడి నుంచే పచ్చళ్లు, పొడులు సరఫరా అవుతుంటాయి. దాంతో.. అన్ని బ్రాంచుల్లోనూ ఇలాంటి ప్రమాణాలు పాటించని పదార్థాలే అమ్ముతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై.. ఓ కస్టమర్ వాట్సాప్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫుడ్ సేప్టీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఇందులోనే.. సుబ్బయ్య హోటల్ లోని నిర్వహణ లోపాలు వెలుగు చూశాయి. దాంతో.. ఈ హోటళ్లపై అధికారులు కేసులు నమోదు చేశారు. గత ఆగస్టులోనూ ఇలాంటి ఓ కేసు నమోదైనట్లు తెలిపిన అధికారులు.. మరోమారు ఇలాంటి ఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×