Megha Mahesh..ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు, హీరోయిన్లు సరైన వయసులోనే పెళ్లి చేసుకుని అభిమానులను సంతోషపరుస్తున్నారు. ముఖ్యంగా వెండితెరపై ఎంతోమంది సెలబ్రిటీలు సరైన సమయంలో వివాహం చేసుకొని, ఒక కొత్త జీవితాన్ని ఆస్వాదించడానికి పరుగులు పెడుతుంటే, మరి కొంతమంది మాత్రం 6 పదుల వయసు దాటినా..వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. మరోవైపు వెండితెర నటీనటులే కాదు బుల్లితెర నటీనటులు కూడా వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో కొంతమంది తాము ప్రేమలో ఉన్నామంటూ చెప్పి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఒక నటి కూడా తాజాగా తాను ప్రేమలో ఉన్నానంటూ.. తన రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేస్తూ.. త్వరలోనే పెళ్లి అంటూ కామెంట్లు చేసింది.
మేఘా మహేష్ కెరియర్..
ఆమె ఎవరో కాదు బుల్లితెర నటి మేఘా మహేష్ (Megha Aakash). ఆమె మొదట మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు స్కూలింగ్ చదువుతున్న సమయంలోనే.. నటన మీద ఆసక్తితో చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ పూర్తిచేసుకుని.. ‘వధు’ అనే సీరియల్ ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. సీరియల్స్ లోనే కాదు పలు చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘మిజి’ అనే సీరియల్ లో నటిస్తోంది.
త్వరలో ఏడడుగులు వేయబోతున్న మేఘా మహేష్..
ఇక మేఘా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. గత కొద్ది రోజుల నుంచి ‘మౌనరాగం -2’ సీరియల్ నటుడు సల్మానుల్ ఫ్యారిస్ (Salmanul Faris) తో ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆమె మాత్రం ఏ రోజు స్పందించలేదు. దీంతో త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు షికార్లు చేశాయి. రోజుకొక వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు మేఘా మహేష్ స్వయంగా తన రిలేషన్షిప్ గురించి ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. అందులో భాగంగానే అతడితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ” మేమిద్దరం జీవితంలో కలసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాము. ప్రేమ, వినోదం, జాగ్రత్త, ఆనందాలు, పిచ్చి, దుఃఖం, ఒడిదుడుకులు ఇలా అన్ని విషయాలలో చిరకాలం భాగస్వామ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాము. ఎప్పుడూ మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది మేఘా మహేష్. ప్రస్తుతం మేఘా మహేష్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఎప్పుడు వివాహం చేసుకుంటుంది అనే విషయాన్ని మాత్రం ఆమె తెలియజేయలేదు. ఇకపోతే ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొంతమంది ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ట్విస్ట్ ఇచ్చావు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏమైనా మరో బుల్లితెర జంట ఇప్పుడు ఒక్కటి కాబోతున్నారని చెప్పవచ్చు. ఇక సల్మానుల్ ఫ్యారిస్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ‘పిన్నిల్ ఓరల్’ అనే సినిమాలో నటిస్తున్నారు. మొత్తానికైతే ఈ జంట ఏడడుగులు, మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారని తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.