Sailajanath Joins Ysrcp: ఏపీలో రాజకీయ నేతల వలసలు కంటిన్యూ అవుతున్నాయి. అందరు అనుకున్నట్లుగానే ఏపీ కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ సీఎం జగన్.
కొన్నిరోజులుగా వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. ఈ క్రమంలో కర్నూలు వైసీపీ నేత ఇంట పెళ్లికి వెళ్లారు జగన్. ఆ ఫంక్షన్‌కు శైలజానాథ్ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ఇరువురు మధ్య మంతనాలు జరిగినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది.
శుక్రవారం ఉదయం తాడేపల్లిలో వైసీపీ ఆఫీసుకు అనంతపురం జిల్లా నేతలతో కలిసి వచ్చారు శైలజనాథ్. ఈ క్రమంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనను పార్టీలోకి జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శైలజానాథ్, జగన్ నాయకత్వంలో పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
ప్రజల తరపున వైసీపీ పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోవడం కోసం మారినట్టు చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం, మెడికల్ సీట్ల వ్యవహారం, ఎడ్యుకేషన్, రోడ్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారన్నారు.
ALSO READ: జగన్‌కి విజయసాయి కౌంటర్ ఎటాక్.. భయం లేదు, అందుకే వదిలేశా
కక్షపూరిత రాజకీయాలు మంచిది కాదన్నారు శైలజానాథ్. రాష్ట్ర, ప్రజల సంక్షేమానికి కూటమి సర్కార్ అన్యాయం చేస్తోందన్నారు. వైసీపీ నుంచి అందరూ వెళ్లిపోతుంటే.. ఈ పార్టీలోకి ఎలా వచ్చారన్న ప్రశ్నకు తనదైన శైలిలో మాట్లాడారు. ఎన్డీయే విధానాలు ప్రజలకు అనుకూలంగా లేకపోవడం వల్లే పార్టీ మారినట్టు మనసులోని మాట బయటపెట్టారు.
ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్‌లో ఉండిపోయారు శైలజానాథ్. ఆ తర్వాత ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. మొన్నటి ఎన్నికల ముందు వైఎస్ షర్మిల ఆ పార్టీ పగ్గాలు అందుకున్నారు. గత ఎన్నికల ముందు ప్రధాన పార్టీలోకి వచ్చేందుకు శైలజానాథ్ తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.
అనంతపురం జిల్లా మడకశిర సీటు గురించి ఏ పార్టీ నుంచి సరైన హామీ ఇవ్వకపోవడంతో సైలెంట్ అయ్యారు శైలజానాథ్. సమయం చూసిన ఆయన, ఇప్పుడు జాయిన్ అయితే ఫ్యూచర్ ఉంటుందని భావించి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శైలజానాథ్
వైసీపీ కండువా వేసి శైలజానాథ్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్ pic.twitter.com/FLN3VxKJxm
— BIG TV Breaking News (@bigtvtelugu) February 7, 2025