Vijay Paul Arrest: రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో.. సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్ అరెస్టు అయ్యారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని గతంలో రఘురామ(RRR) ఫిర్యాదు చేశారు. దీంతో విజయ్ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిన్న విజయ్‍పాల్(Vijay Paul) ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ పాల్ రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు పోలీసులు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లోనే ఉన్న విజయ్ పాల్‌ను.. ఇవాళ గుంటూరు తరలించనున్నారు.
2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌పై రఘురామకృష్ణరాజు(Raghurama Krishnam Raju) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అప్పటి సీఎం జగన్‌తో పాటు నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, నిఘా విభాగం అధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సీఐడీ అదనపు ఎస్పీ ఆర్ విజయ్‌పాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో.. సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్(Vijay Paul) అరెస్టు అయ్యారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని గతంలో రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో విజయ్ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం విజయ్‍పాల్‌ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ పాల్ రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు పోలీసులు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లోనే ఉన్న విజయ్ పాల్‌ను.. ఈరోజు(బుధవారం) గుంటూరు తరలించనున్నారు.
Also Read: సీఎం రేవంత్ తో ఆ వైసీపీ నేతలు.. చెడుగుడు ఆడుకున్న జగన్.. బిగ్ టీవీతో బాలినేని
2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌పై(Ys Jagan) రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎం జగన్‌తో పాటు నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, నిఘా విభాగం అధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సీఐడీ అదనపు ఎస్పీ ఆర్ విజయ్‌పాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.